ఇవి ఉంటే చింతలేదు!

రైలు ప్రయాణాల్లో మనల్ని ఇబ్బంది పెట్టే అంశం... టాయిలెట్లు. అపరిశుభ్రంగా ఉండే టాయిలెట్‌ సీట్లు ఇబ్బందినే కాదు.. జననేంద్రియ ఇన్‌ఫెక్షన్లనీ కలిగిస్తాయి. దీన్నుంచి బయటపడటానికి చక్కని పరిష్కారం.. డిస్పోజబుల్‌

Published : 05 Mar 2022 00:51 IST

సౌకర్యం

రైలు ప్రయాణాల్లో మనల్ని ఇబ్బంది పెట్టే అంశం... టాయిలెట్లు. అపరిశుభ్రంగా ఉండే టాయిలెట్‌ సీట్లు ఇబ్బందినే కాదు.. జననేంద్రియ ఇన్‌ఫెక్షన్లనీ కలిగిస్తాయి. దీన్నుంచి బయటపడటానికి చక్కని పరిష్కారం.. డిస్పోజబుల్‌ టాయిలెట్‌ సీట్‌ కవర్లు. తేలిగ్గా వాడుకోవచ్చు. ఇన్‌ఫెక్షన్లు బారిన పడకుండా ఉంటాం. పిల్లలతో ప్రయాణించేటప్పుడు ప్రయాణ సమయంలో హ్యాండ్‌బ్యాగులో వీటిని ఉంచుకుంటే ఎంతో సౌకర్యంగా ఉంటుంది.

ఇన్‌ఫెక్షన్లకు దూరంగా ఉంచే మరో పరికరం.. పీబడ్డీ ఫన్నెల్‌. మూత్రవిసర్జన కోసం... అపరిశుభ్రంగా ఉన్న టాయిలెట్‌ సీట్‌పై కూర్చోలేక ఇబ్బంది పడేవారికి ఇదెంతో సౌకర్యవంతంగా ఉంటుంది. ఒకసారి వాడిన తర్వాత శుభ్రం చేసి మళ్లీ వాడుకోవచ్చు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్