నాజూకు నడుముకు రష్యన్‌ ట్విస్ట్‌

కళ్ల కింద క్యారీ బ్యాగులే కాదు.. ఇప్పుడు చాలామంది మహిళలు, అమ్మాయిలు నడుముకు ఇరువైపులా కూడా భారీ బ్యాగులనూ మోస్తున్నారు. అదేనండి నడుము పక్కన కొవ్వు పేరుకుపోవడం! చాలాసేపు ఒకేచోట కూర్చొని పనిచేసే వారిలో

Published : 06 Mar 2022 01:29 IST

కళ్ల కింద క్యారీ బ్యాగులే కాదు.. ఇప్పుడు చాలామంది మహిళలు, అమ్మాయిలు నడుముకు ఇరువైపులా కూడా భారీ బ్యాగులనూ మోస్తున్నారు. అదేనండి నడుము పక్కన కొవ్వు పేరుకుపోవడం! చాలాసేపు ఒకేచోట కూర్చొని పనిచేసే వారిలో ఈ సమస్య అధికంగా కనిపిస్తుంది. దాన్ని తగ్గించాలంటే ఈ ట్విస్ట్‌ కావాల్సిందే అంటున్నారు నిపుణులు.

ఎలా చేయాలంటే...

మొదట మ్యాట్‌పై కూర్చోవాలి. ఫొటోలో చూపినట్లు కాళ్లను మోకాళ్ల వరకు మడవాలి. చేతులను కలుపుతూ ముందుకు చాపాలి. నెమ్మదిగా కాస్త వెనక్కి వంగాలి. అయితే నడుము నేలకు ఆనకుండా జాగ్రత్త పడాలి. ఆ తర్వాత మెల్లిగా శరీర పైభాగాన్ని రెండు చేతులతో సహా ఓసారి కుడివైపు, మరోసారి ఎడమ వైపు తిప్పాలి. ఈ వ్యాయామం చేస్తున్నప్పుడు పొట్ట కండరాలను పట్టి ఉంచాలి. వీపును సాధ్యమైనంత మేర నిటారుగా పెట్టడానికి ప్రయత్నించాలి. కావాలంటే కాస్త వంగొచ్చు. అయితే మరీ ఎక్కువగా వంగితే వీపు నొప్పెట్టొచ్చు. ఈ వ్యాయామం వల్ల భుజాలతోపాటు నడుము చుట్టూ పెరిగిన భారం కాస్త కరిగిపోతుంది. చక్కటి ఫలితాల కోసం సెట్టుకు 10-12 చొప్పున మూడు సెట్లు చేయాలి.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్