మొబైల్ పక్కన పెట్టేయండి!
ఒక్కోసారి ఒంట్లో బాలేదనిపిస్తుంటుంది. అనుకోకుండా నీరసం, నిస్సత్తువ. మనమేమో ఇంట్లో పని ఎక్కువైందనో, విశ్రాంతి సరిపోలేదనో అనుకొని ఊరుకుంటాం. కానీ.. కాలక్షేపంగా లేదా పనిలో తప్పనిసరిగా ఉపయోగించే ఫోనూ ఇలాంటి వాటికి కారణమంటున్నారు నిపుణులు.
ఒక్కోసారి ఒంట్లో బాలేదనిపిస్తుంటుంది. అనుకోకుండా నీరసం, నిస్సత్తువ. మనమేమో ఇంట్లో పని ఎక్కువైందనో, విశ్రాంతి సరిపోలేదనో అనుకొని ఊరుకుంటాం. కానీ.. కాలక్షేపంగా లేదా పనిలో తప్పనిసరిగా ఉపయోగించే ఫోనూ ఇలాంటి వాటికి కారణమంటున్నారు నిపుణులు. ఇంకా ఏం చెబుతున్నారంటే..
* కొనుగోళ్ల దగ్గర్నుంచి, ఆఫీసు పని వరకు ఏది సాగాలన్నా మొబైలే మార్గమైంది. కానీ దీన్ని ఎక్కువగా చూస్తోంటే కళ్లపై ఒత్తిడిని కలగజేస్తుంది. మన శరీరంలో అతి సున్నితమైన భాగాలివి. ఫోన్ల నుంచి వచ్చే నీలికాంతి తలనొప్పి, కళ్లనొప్పులు, కళ్లు పొడిబారడం వంటివాటికి కారణమవొచ్చు. కాబట్టి తరచూ వాడాల్సొస్తే ప్రతిసారీ కనీసం 15 నిమిషాలు పక్కన పెట్టేయడం మంచిది.
* అనుకోకుండా చేయి లాగడం, మణికట్టు నొప్పి అనగానే మనకొచ్చే మొదటి ఆలోచన క్యాల్షియం తగ్గిందనే. పిల్లలు పుట్టాక మరీ సాధారణమనుకుంటాం. కానీ మొబైల్‌ను చూసే క్రమంలో మనం పట్టుకునేతీరు, తరచూ చేతిలో పట్టుకొని తిరగడమూ కారణమవొచ్చట. వీడియోలు చూడాల్సొస్తే పక్కన పెట్టుకొనే ఏర్పాటు చేయడమో, బయటకు వెళ్లాల్సొస్తే బ్యాగులో పెట్టుకోవడమో చేయండి.
* అకస్మాత్తుగా మొటిమలా? స్నేహితులతో మాట్లాడుతుంటే సమయమే తెలియదు కదా! పెట్టేసరికి కొంచెం తడి గమనించారా? వాటిని అలా తుడిచేసి పక్కన పెట్టేస్తాం. ఈలోగా దుమ్ము పడొచ్చు. మనం ఎక్కడో తాకిన చేతులతో పట్టుకున్నా.. దుమ్ము, క్రిములు తెరపైకి చేరొచ్చు. మనం ఫోను వాడినప్పుడు ముఖంపైకి చేరే ఈ చిక్కులు. దీనివల్ల త్వరగా వృద్ధాప్య ఛాయలు వచ్చే అవకాశమూ ఉందట. కాబట్టి, రోజూ తెరను శుభ్రం చేసుకోవడం మంచిది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
బ్యూటీ & ఫ్యాషన్
- వేసవిలో ట్యాన్ సమస్య తగ్గాలంటే..!
- అడ్డిగ... అందాల నగ!
- ఇలా చేస్తే.. అందం తగ్గదు..!
- నాకు ఏ క్రీమ్?
- స్ట్రెచ్ మార్క్స్.. తగ్గట్లేదా..?
ఆరోగ్యమస్తు
- అందుకే వీటిని ఇలా తీసుకోవాలట..!
- వసంతంలో ఆరోగ్య జాగ్రత్తలు..!
- ప్రెగ్నెన్సీ.. ఈ జాగ్రత్తలు పాటిస్తున్నారా?
- ఉత్తేజంగా మారాలంటే..!
- రక్తహీనత తగ్గించే బీట్రూట్!
అనుబంధం
- ఒక మెట్టు దిగితే చాలు...
- ఆ అమ్మాయితో ఆ చాటింగ్.. ఆయన్ని నమ్మలేకపోతున్నా..!
- అలా చదివితే మేలే...
- చిన్నవే... చక్కదిద్దుతాయి!
- యుక్త వయసు నుంచీ...!
యూత్ కార్నర్
- అప్పుడు ఫ్యాన్... ఇప్పుడందరి ఫేవరెట్!
- భూగోళాన్ని చుట్టేస్తానంటోంది!
- దాంతో మాట్లాడుతుంటే మతి పోయిందనేవాళ్లు!
- ఎరీ... ఆ ఊరి పట్టు..!
- అందరికీ నచ్చేవి.. నాకు నచ్చవు.. ఎందుకిలా?
'స్వీట్' హోం
- పుల్లటి పెరుగుతో.. పెరిగే రుచి!
- రిస్క్ లేకుండా దాచేద్దాం!
- వేసవిలో ఇల్లు చల్లగా...
- కళ్లు తిరిగే కార్పెట్లు...
- ఆ చోటు గుర్తిస్తే చాలు...
వర్క్ & లైఫ్
- మీకు ‘ట్రావెలింగ్’ అంటే ఇష్టమా..?
- పనికి ‘బ్రేక్’ వేయండి!
- ఇవి టైంపాస్ కోసమే కాదు.. సంపాదనకూ..!
- మారాలని గట్టిగా అనుకోండి!
- Samantha: చిన్న చిట్కాలతోనే 45 కిలోల బరువు తగ్గా..!