బరువు ఎప్పుడూ ఒకేలా ఉండాలంటే..!

రాధిక ఎత్తుకు తగిన బరువే ఉన్నా... ఎక్కడ తాను బరువు పెరుగుతానో అనే ఆందోళనలో ఉంటోంది. తగిన బరువున్నా దాన్ని పెరగకుండా చేయడం కూడా సవాలే. కొన్ని అలవాట్లను పాటిస్తే బరువు పెరగకుండా జాగ్రత్తపడొచ్చంటున్నారు నిపుణులు..  

Published : 07 Mar 2022 00:14 IST

రాధిక ఎత్తుకు తగిన బరువే ఉన్నా... ఎక్కడ తాను బరువు పెరుగుతానో అనే ఆందోళనలో ఉంటోంది. తగిన బరువున్నా దాన్ని పెరగకుండా చేయడం కూడా సవాలే. కొన్ని అలవాట్లను పాటిస్తే బరువు పెరగకుండా జాగ్రత్తపడొచ్చంటున్నారు నిపుణులు..  

ఎనిమిది తర్వాత: రాత్రి 8 తర్వాత ఆహారాన్ని తీసుకోకూడదు. రాత్రి పూట శరీరం వ్యర్థాలను తొలగించే ప్రయత్నంలో ఉంటుంది. అలాగే కొత్త కణాల ఉత్పత్తీ జరుగుతుంది. ఆ సమయానికి జీర్ణవ్యవస్థ విధులు ముగించుకుని ఉంటేనే ఇవన్నీ వీలవుతాయి. అందుకే రాత్రి ఎనిమిది గంటల్లోపే భోజనం ముగిస్తే అది రెండుగంటల్లోపు జీర్ణమవుతుంది. అలాకాకుండా ఆలస్యంగా, ఎక్కువ మోతాదులో తినడంతో జీవక్రియలకు అంతరాయం కలుగుతుంది. అధికబరువు సమస్య ఎదురవుతుంది.

చక్కెర: ఆహారంలో చక్కెరను తగ్గించుకోండి.పోషక విలువలు,  కెలోరీలు లేని చక్కెర అధిక బరువుకు కారణమవుతుంది. ప్రాసెస్డ్‌ ఫుడ్‌, బర్గర్లు, పిజా, సమోసా, చిప్స్‌, కప్‌ నూడిల్స్‌, వేపుళ్లు, నూనె ఎక్కువగా ఉండే ఆహారానికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. వీటిలో అధికస్థాయి సోడియం, చక్కెర, కొవ్వు వంటివి అనారోగ్యానికి దారి తీస్తాయి. శరీరం బరువు ఎప్పుడూ ఒకేలా ఉండాలంటే ఈ నియమాన్ని తప్పక పాటించాలి. అలాగే వెజిటబుల్‌, రిఫైన్డ్‌ నూనెల వాడకానికి దూరంగా ఉండటం మేలు. వీటికి బదులుగా నెయ్యి, ఆవనూనె, ఆలివ్‌ నూనె వంటివి ఎంచుకోవాలి. శరీరానికి తగినంత నీరు అందేలా నిమ్మరసం, కొబ్బరినీళ్లు, తాజా పండ్లరసం, సూప్స్‌ వంటివి తీసుకుంటే మంచిది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్