నొప్పా.. అతికించండి!
నెలసరిలో అమ్మాయిలు మానసికంగానే కాదు.. శారీరకంగానూ ఎన్నో ఇబ్బందులకు గురవుతారు. ఆ సమయంలో వచ్చే నొప్పి మరింత అవస్థ పెడుతుంది. తట్టుకోలేమనుకున్నప్పుడు కొందరు
నెలసరిలో అమ్మాయిలు మానసికంగానే కాదు.. శారీరకంగానూ ఎన్నో ఇబ్బందులకు గురవుతారు. ఆ సమయంలో వచ్చే నొప్పి మరింత అవస్థ పెడుతుంది. తట్టుకోలేమనుకున్నప్పుడు కొందరు మాత్రల సాయం తీసుకుంటారు. అయితే అది దీర్ఘకాలంలో ఇతర సమస్యలను తెచ్చిపెడుతుందని పంటి బిగువన భరించేవారే ఎక్కువ. లేదంటే వేడినీటి కాపడంతో తాత్కాలిక ఉపశమనం పొందాల్సిందే. ఇంట్లో ఉన్నప్పుడు సరే.. మరి కాలేజీకో, ఆఫీసుకో వెళితే? అలాంటి వారి కోసమే అందుబాటులోకి వచ్చాయీ హీటింగ్ ప్యాడ్స్. పీరియడ్ సమయంలో గర్భాశయ కండరాలు రక్తాన్ని బయటకు పంపే క్రమంలో సంకోచ వ్యాకోచాలకు గురవుతుంటాయి. అవి విపరీతమైనప్పుడే నొప్పి. ఈ హీటింగ్ ప్యాడ్స్ వేడిని ఉత్పన్నం చేసి ఆ కండరాలు విశ్రాంతి పొందేలా చూస్తాయి. ఫలితంగా నొప్పి దూరమవుతుంది. కొన్ని సంస్థలు ఐరన్, మట్టి, యాక్టివేటెడ్ కార్బన్, ఉప్పు వంటి సహజమైన వాటిని ఉపయోగించి తయారు చేస్తున్నాయి. దీంతో రసాయనాల గురించిన బెంగ అవసరం లేదు. ప్యాచ్‌ను ప్యాకెట్లోంచి తీసి పొత్తికడుపు మీద పెట్టుకుంటే సరిపోతుంది. కదలకుండా అతికించే సౌకర్యమూ ఉంటుంది. వెచ్చదనం తగలట్లేదు అనుకున్నప్పుడు తీసేస్తే సరిపోతుంది. అయితే కొనేప్పుడు వేటిని ఉపయోగించి చేశారన్నది చూసుకోవడం మాత్రం తప్పనిసరి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
బ్యూటీ & ఫ్యాషన్
- వేసవిలో ట్యాన్ సమస్య తగ్గాలంటే..!
- అడ్డిగ... అందాల నగ!
- ఇలా చేస్తే.. అందం తగ్గదు..!
- నాకు ఏ క్రీమ్?
- స్ట్రెచ్ మార్క్స్.. తగ్గట్లేదా..?
ఆరోగ్యమస్తు
- అందుకే వీటిని ఇలా తీసుకోవాలట..!
- వసంతంలో ఆరోగ్య జాగ్రత్తలు..!
- ప్రెగ్నెన్సీ.. ఈ జాగ్రత్తలు పాటిస్తున్నారా?
- ఉత్తేజంగా మారాలంటే..!
- రక్తహీనత తగ్గించే బీట్రూట్!
అనుబంధం
- ఒక మెట్టు దిగితే చాలు...
- ఆ అమ్మాయితో ఆ చాటింగ్.. ఆయన్ని నమ్మలేకపోతున్నా..!
- అలా చదివితే మేలే...
- చిన్నవే... చక్కదిద్దుతాయి!
- యుక్త వయసు నుంచీ...!
యూత్ కార్నర్
- అప్పుడు ఫ్యాన్... ఇప్పుడందరి ఫేవరెట్!
- భూగోళాన్ని చుట్టేస్తానంటోంది!
- దాంతో మాట్లాడుతుంటే మతి పోయిందనేవాళ్లు!
- ఎరీ... ఆ ఊరి పట్టు..!
- అందరికీ నచ్చేవి.. నాకు నచ్చవు.. ఎందుకిలా?
'స్వీట్' హోం
- పుల్లటి పెరుగుతో.. పెరిగే రుచి!
- రిస్క్ లేకుండా దాచేద్దాం!
- వేసవిలో ఇల్లు చల్లగా...
- కళ్లు తిరిగే కార్పెట్లు...
- ఆ చోటు గుర్తిస్తే చాలు...
వర్క్ & లైఫ్
- మీకు ‘ట్రావెలింగ్’ అంటే ఇష్టమా..?
- పనికి ‘బ్రేక్’ వేయండి!
- ఇవి టైంపాస్ కోసమే కాదు.. సంపాదనకూ..!
- మారాలని గట్టిగా అనుకోండి!
- Samantha: చిన్న చిట్కాలతోనే 45 కిలోల బరువు తగ్గా..!