అక్కడ శుభ్రత అవసరం

జననేంద్రియాల వద్ద పరిశుభ్రత పాటించకుంటే తీవ్ర ఇన్ఫెక్షన్ల బారిన పడే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు వైద్యులు. అలా కాకుండా ఉండాలంటే పాటించాల్సిన, పాటించకూడని అంశాలను చెబుతున్నారిలా.

Published : 10 Mar 2022 02:31 IST

జననేంద్రియాల వద్ద పరిశుభ్రత పాటించకుంటే తీవ్ర ఇన్ఫెక్షన్ల బారిన పడే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు వైద్యులు. అలా కాకుండా ఉండాలంటే పాటించాల్సిన, పాటించకూడని అంశాలను చెబుతున్నారిలా.

లోదుస్తులు..
రోజులో ఎక్కువ గంటలు ధరించే లోదుస్తుల ఎంపికలో నాణ్యతకు పెద్ద పీట వేయాలి. బిగుతుగా కాకుండా కొంచెం వదులుగా ఉండేలా జాగ్రత్తపడాలి. సిల్కువి  వద్దే వద్దు. మృదువైన కాటన్‌తో తయారైనవే ధరించడం మంచిది. లేదంటే ఆ ప్రాంతానికి గాలి సోకదు. అక్కడి చర్మం అలర్జీకి గురవుతుంది. ఫలితంగా ఇన్‌ఫెక్షన్లు వచ్చే ప్రమాదం ఉంది. రాత్రి సమయాల్లో లోదుస్తులు ధరించకపోవడమే మంచిది.

శుభ్రతలో..
జననేంద్రియాలను శుభ్రం చేసుకునేటప్పుడు ముందు నుంచి వెనుకభాగం వైపు కూడా శుభ్రం చేయడం ముఖ్యం.  జననేంద్రియాల ఆరోగ్యానికి శారీరక వ్యాయామం కూడా తప్పనిసరి. దీంతో ఆ ప్రాంతం చుట్టుపక్కల కండరాలన్నీ బలోపేతమవుతాయి. ప్రసవ సమయంలో ఇబ్బందులు రావు. లైంగిక జీవితంలోనూ సమస్యలుండవు.

దూరంగా..
పౌడర్‌, క్రీమ్స్‌, లోషన్లు, మాయిశ్చరైజర్‌, సుగంధ ద్రవ్యాలు వంటివి జననేంద్రియాల వద్ద వినియోగించకూడదు. వీటి వల్ల అక్కడి చర్మంలో పీహెచ్‌ స్థాయులు మారిపోతాయి. ఎసిడిటీ స్థాయిలోనూ మార్పులొచ్చి, పలురకాల సూక్ష్మజీవులు చేరి ఇన్ఫెక్షన్లకు కారణమవుతాయి. మూత్రనాళాల మార్గంలోనూ ఈ తరహా సమస్యలు తలెత్తేలా చేస్తాయి. అలాగే నిర్ణీత కాలానికి ఒకసారి గైనకాలజిస్ట్‌ను సంప్రదిస్తే కొన్ని సమస్యలకు ముందే చెక్‌ పెట్టొచ్చు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్