అక్కడి కొవ్వును కరిగిద్దాం...

పద్మ ఏ దుస్తులను ఎంపిక చేసుకున్నా అసౌకర్యంగానే ధరిస్తుంది. భుజానికి కింద వైపు, ఛాతీకి ఇరుపక్కలా అదనపు కొవ్వు కారణంగా అక్కడ ఆకృతి మారిపోతోంది. టాప్‌ లేదా బ్లవుజు ఏది వేసుకున్నా ఆ ప్రాంతంలో ఇబ్బందిగానే అనిపిస్తుంది. ఈ భాగంలో కొవ్వు ఎందుకు పేరుకుంటుంది? దాన్ని తగ్గించుకోవడం ఎలానో చెబుతున్నారు నిపుణులు...

Published : 11 Mar 2022 00:49 IST

పద్మ ఏ దుస్తులను ఎంపిక చేసుకున్నా అసౌకర్యంగానే ధరిస్తుంది. భుజానికి కింద వైపు, ఛాతీకి ఇరుపక్కలా అదనపు కొవ్వు కారణంగా అక్కడ ఆకృతి మారిపోతోంది. టాప్‌ లేదా బ్లవుజు ఏది వేసుకున్నా ఆ ప్రాంతంలో ఇబ్బందిగానే అనిపిస్తుంది. ఈ భాగంలో కొవ్వు ఎందుకు పేరుకుంటుంది? దాన్ని తగ్గించుకోవడం ఎలానో చెబుతున్నారు నిపుణులు.

నియంత్రించాలి.. మహిళల్లో ఎక్కువగా కనిపించే ఈ ఆర్మ్‌పిట్‌ ఫ్యాట్‌కు కారణాలు అనేకం ఉన్నాయి. బిగుతుగా ధరించే టాప్స్‌, లోదుస్తుల వల్ల ఛాతీ, ఆర్మ్‌పిట్‌కు మధ్యలో ఉండే చర్మం బయటికి ఉబ్బినట్లుగా వచ్చే అవకాశమెక్కువ. అలాగే జన్యువులు కూడా ఓ కారణం కావొచ్చని అధ్యయనాలు చెబుతున్నాయి. ఏది ఏమైనా ఈ సమస్యకు దూరంగా ఉండాలంటే బరువును నియంత్రించుకోవాలి. శరీరంలో అధిక శాతం కొవ్వు ఉంటే కొంత ఈ భాగంలో నిల్వ ఉండే ప్రమాదం ఉంది. పోషకవిలువలతోపాటు పీచు ఎక్కువగా ఉన్న ఆహారాన్ని తీసుకుంటూ వ్యాయామాలు చేస్తే దీన్నుంచి బయటపడొచ్చు.

హార్మోన్లు.. శరీరంలో హార్మోన్ల అసమతుల్యతతో ఛాతీ వద్ద అదనంగా కణజాలం పెరుగుతుంది. గర్భం దాల్చినప్పుడు, నెలసరి సమయంలో, మెనోపాజ్‌ వంటి సమయాల్లో హార్మోన్లు సమతుల్యంగా ఉండవు. దీంతో ఈస్ట్రోజెన్‌, ప్రొజెస్టిరాన్‌ వంటివి ఉత్పత్తి అవడంలో తేడా మొదలవుతుంది. ఈ కారణంగా అదనపు చర్మ కణజాలం లేదా కొవ్వును ఆ ప్రాంతంలో చేరుకునేలా చేస్తుంది. ఈ సమస్యకు వైద్యుల సలహా, సూచనలను పాటిస్తే మంచిది.

తగ్గించుకోవడం ఇలా... రోజూ వ్యాయామంలో భాగంగా పుష్‌ అప్స్‌ చేయాలి. వీటితో అప్పర్‌ ఆర్మ్స్‌, భుజాలు, ఛాతీ వద్ద ఉన్న కండరాలు బిగుతుగా మారతాయి, బలోపేతమవుతాయి. కొవ్వు కరుగుతుంది. బిగుతు దుస్తులకు దూరంగా ఉండాలి. వీటికి తోడు కొవ్వు పదార్థాలను వీలైనంతగా తగ్గించాలి. ఈ జాగ్రత్తలు తీసుకుంటే ఈ సమస్య నుంచి బయటపడొచ్చు. చక్కగా నచ్చిన దుస్తులు ధరించవచ్చు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్