గర్భం దాల్చినప్పుడు...

లతకు అయిదు నిండుతోంది. గర్భందాల్చినప్పటి నుంచి మునుపటిలా ఉండలేకపోతోంది. శారీరకంగా ఆరోగ్యంగా ఉన్నా.. మానసికంగా ఏదో సమస్య. అది ఆమె ప్రవర్తనపై తీవ్ర ప్రభావాన్ని చూపుతోంది. ప్రసవానికి ముందు ఇటువంటి పరిస్థితి ఎదురవడం సాధారణమే అంటున్నారు వైద్యనిపుణులు.

Published : 13 Mar 2022 01:44 IST

లతకు అయిదు నిండుతోంది. గర్భందాల్చినప్పటి నుంచి మునుపటిలా ఉండలేకపోతోంది. శారీరకంగా ఆరోగ్యంగా ఉన్నా.. మానసికంగా ఏదో సమస్య. అది ఆమె ప్రవర్తనపై తీవ్ర ప్రభావాన్ని చూపుతోంది. ప్రసవానికి ముందు ఇటువంటి పరిస్థితి ఎదురవడం సాధారణమే అంటున్నారు వైద్యనిపుణులు. అయితే ఈ సమస్యను అధిగమించడానికి ప్రయత్నించాలని సూచిస్తున్నారు.

సాధారణంగా ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేనివారు కూడా గర్భం దాల్చాక మానసికంగా కొంత కుంగుబాటుకు గురవుతారు. ప్రసవంపై భయం లేదా భవిష్యత్తు గురించి ఆలోచించటం, ప్రణాళిక లేకుండా గర్భందాల్చామనే భావన వంటివెన్నో ఈ పరిస్థితికి కారణమవుతాయి. ఈ ఆలోచనలను మనసు నియంత్రించలేదు. దాంతోపాటు ఈ సమయంలో వచ్చే మూడ్‌ స్వింగ్స్‌ అదుపులో ఉండకపోవడం కూడా మానసికాందోళన స్థాయిని పెంచుతుంది. ఇటువంటప్పుడు అలక్ష్యం చేయకూడదు. మొదట ఆరోగ్య సమస్యల్లేకుండా జాగ్రత్తపడుతూ మరోవైపు మానసిక సమస్య నుంచి బయటపడటానికి ప్రయత్నించాలి. ఇందుకు వైద్యుడిని సంప్రదిస్తే మంచిది.

మానసిక ఉల్లాసం...

థెరపీ ద్వారా కూడా మానసిక ఉల్లాసాన్ని తిరిగి పొందొచ్చు. ప్రెగ్నెన్సీని సంతోషంగా గడపాలంటే ప్రతిరోజు ధ్యానం, రెండు పూటలా భోజనమయ్యాక 20 నిమిషాలపాటు నడక తప్పనిసరి.  అలాగే కుటుంబం, స్నేహితులతో ఉత్సాహంగా సమయాన్ని గడపాలి. పోషకవిలువులున్న ఆహారానికి ప్రాముఖ్యతనివ్వాలి. ఉద్యోగం మారడం, లేదా ఇల్లు కొనుగోలు వంటి నిర్ణయాలను తాత్కాలికంగా నిలపాలి. లేదంటే అవి కూడా అదనపు ఒత్తిడిని తెచ్చిపెడతాయి. కంటినిండా నిద్రపోతూ, మానసిక ఒత్తిడికి దూరంగా ఉండాలి. అప్పుడే పుట్టబోయే పాపాయికి సంతోషంగా ఆహ్వానం పలకగలం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్