లాభమా... నష్టమా!

ప్రస్తుతం ఆరోగ్యం పట్ల శ్రద్ధ పెరిగింది. దాంతో చాలా మంది ఇంటి ఆహారాన్నే ఎక్కువగా తీసుకుంటున్నారు. అందునా మల్టీగ్రెయిన్‌ పిండిని వాడుతున్నారు. మరి దీన్ని గురించిన అపోహలు - నిజాలు ఏంటో తెలుసుకుందామా...

Published : 16 Mar 2022 00:42 IST

ప్రస్తుతం ఆరోగ్యం పట్ల శ్రద్ధ పెరిగింది. దాంతో చాలా మంది ఇంటి ఆహారాన్నే ఎక్కువగా తీసుకుంటున్నారు. అందునా మల్టీగ్రెయిన్‌ పిండిని వాడుతున్నారు. మరి దీన్ని గురించిన అపోహలు - నిజాలు ఏంటో తెలుసుకుందామా...


మల్టీగ్రెయిన్‌ పిండితో బరువు తగ్గుతారు...

నిజం... బరువును తగ్గించడంలో ఈ పిండి ఉపయోగపడుతుంది. అయితే మీరెంత మొత్తంలో తీసుకుంటున్నారనే దానిపై ఆ విషయం ఆధారపడుతుంది. ఉదాహరణకు  చపాతీల కోసం ఎంత పిండిని వాడుతున్నారనేది పరిగణనలోకి తీసుకోవాల్సిందే. ఎందుకంటే ఈ పిండిలో కెలొరీలుంటాయి కదా. ఒకవేళ మీరు తీసుకునే కెలొరీల సంఖ్య ఎక్కువుంటే మల్టీగ్రెయిన్‌ రోటీలు తిన్నా, సాధారణ రోటీలు తిన్నా బరువు తగ్గడంలో తేడా ఉండదు.


ఆరోగ్యాన్నిస్తుందా...

నిజం... రెండు కంటే ఎక్కువ పిండి రకాలని కలిపితే అది మల్టీగ్రెయినే. అయితే ఇలా తయారుచేసిన పిండి అందరికీ ఆరోగ్యాన్నిస్తుందని చెప్పలేం. ఎందుకంటే... ఒక్కో వ్యక్తి శరీర తత్త్వం ఒక్కోలా ఉంటుంది. కొందరికి కొన్ని ధాన్యాలు పడవు. థైరాయిడ్‌ సమస్యతో ఇబ్బంది పడేవారికి జొన్నలు పడవు. వీటితో తయారుచేసిన మల్టీగ్రెయిన్‌ పిండిని వాడితే మేలు కంటే హానే ఎక్కువ. కాబట్టి మీకు సరి పడేదే ఎంచుకోవాలి.


మల్టీగ్రెయిన్‌ పిండిని సొంతంగా చేసుకోవచ్చు..

నిజం... బోలెడు మల్టీగ్రెయిన్‌ పిండి రకాలు మార్కెట్‌లో అందుబాటులో ఉన్నాయి. అయితే కొనే ముందు వీటిలో ఏయే చిరుధాన్యాలు ఏయే నిష్పత్తుల్లో ఉన్నాయో చూడాలి. కేవలం ఒకట్రెండు శాతం చిరుధాన్యాలుండి... మిగతా మొత్తం గోధుమ అయితే అది మల్టీగ్రెయిన్‌ కాదు. దానివల్ల పెద్ద ప్రయోజనం ఉండదు. నిజానికి ఈ పిండిని ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. అయితే ధాన్యాలను ఎంచుకోవడంలో జాగ్రత్తలు పాటించాలి. అవసరమైతే పోషకాహార నిపుణుల సలహా తీసుకోవాలి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్