కొవ్వును కరిగించే ఆరు సూత్రాలు!

బరువు పెరగడం సులువే... తగ్గించుకోవడమే చాలా కష్టం. ఇందుకోసం చాలా శ్రమపడాలి. ఆహారంతోపాటు శారీరక శ్రమ చేయాలి. అందుకు సాయపడే సూత్రాలివీ! ...తక్కువ కెలొరీలుండే కూరగాయలను రోజువారీ ఆహారంలో ఎక్కువగా చేర్చుకోవాలి. ఇవి కడుపు నిండిన భావనను కలిగిస్తాయి....

Published : 17 Mar 2022 00:33 IST

బరువు పెరగడం సులువే... తగ్గించుకోవడమే చాలా కష్టం. ఇందుకోసం చాలా శ్రమపడాలి. ఆహారంతోపాటు శారీరక శ్రమ చేయాలి. అందుకు సాయపడే సూత్రాలివీ!

...తక్కువ కెలొరీలుండే కూరగాయలను రోజువారీ ఆహారంలో ఎక్కువగా చేర్చుకోవాలి. ఇవి కడుపు నిండిన భావనను కలిగిస్తాయి.  

అలాగని మాంసకృత్తులను మరవకూడదు. అందుకోసం మాంసం, పాలు, పప్పుదినుసులను తీసుకోవాలి.

చిరుతిళ్ల పేరుతో కనిపించిన వాటినల్లా తినేయొద్దు. నూనెలో వేయించినవి, మసాలాలను తగ్గించి తాజాపండ్లను తినాలి.

వ్యాయామం తప్పనిసరి. వారంలో కనీసం మూడుసార్లు బరువులెత్తే వ్యాయామాలను చేయాలి. చిన్న వాటితో మొదలుపెట్టి క్రమంగా పెంచుకుంటూ పోవాలి.

అతి తక్కువ/జీరో కెలొరీలుండే శీతలపానీయాలను తీసుకోవాలి. లేదంటే తాజా పండ్ల రసాలను తాగితే సరి.

రోజూ ఎనిమిది వేల అడుగులు వేయాలి. నడక వల్ల శరీరం మొత్తం కదులుతుంది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్