వ్యర్థాలు ఇలా తొలగిద్దాం!

ముఖంపై పేరుకున్న వ్యర్థాలని స్క్రబర్లు, క్రీంలు వాడి తేలిగ్గానే తొలగించుకుంటాం. అదే శరీరంలోపలి వ్యర్థాలు తొలగించాలంటే? వాటికీ మార్గం ఉంది. ప్రత్యేక ఆహారం తీసుకోవడం ద్వారా ఇలా తొలగించుకోవచ్చు.

Updated : 18 Mar 2022 02:57 IST

ముఖంపై పేరుకున్న వ్యర్థాలని స్క్రబర్లు, క్రీంలు వాడి తేలిగ్గానే తొలగించుకుంటాం. అదే శరీరంలోపలి వ్యర్థాలు తొలగించాలంటే? వాటికీ మార్గం ఉంది. ప్రత్యేక ఆహారం తీసుకోవడం ద్వారా ఇలా తొలగించుకోవచ్చు.

చిన్న అల్లం ముక్క, 10-12 పుదీనా ఆకులు, పావు చెక్క నిమ్మరసం, తగినంత ఉప్పు కలిపి మరిగించి చల్లార్చిన నీటిని తాగండి. లేదా ఒక లీటరు నీటిలో రెండు సన్నగా కోసిన నిమ్మకాయ, చిన్న ముక్కలుగా కోసిన సగం కీరా, 10-15 పుదీనా ఆకులు వేసి గంటపాటు పక్కన పెట్టి ఉంచండి. నీటిలో సన్నగా కోసిన నారింజ ముక్కలు, తేనే వేసి అరగంటపాటు ఉంచిన నీటినీ తాగొచ్చు. ఇవి శరీరాన్ని హైడ్రేట్‌ చేయడమే కాక కావాల్సిన న్యూట్రియంట్లనూ అందిస్తాయి. నిమ్మ, తేనె కలిపిన గ్రీన్‌ టీ కూడా బాగా పనిచేస్తుంది.

* తాజాకూరగాయలు, తక్కువ కారం ఉన్న ఆహారానికి ప్రాధాన్యమివ్వాలి. సూపులు వంటి తేలికపాటి ఆహారాన్ని తీసుకోవాలి. బీట్‌రూట్‌ను జ్యూస్‌ లేదా కూర రూపంలో తీసుకుంటే మంచిది. ఇది టాక్సిన్లను బయటకు పంపేస్తుంది. టమాటాలోనూ యాంటీఆక్సిడెంట్లు ఎక్కువ. ఇదీ శరీరాన్ని త్వరగా డీటాక్స్‌ చేస్తుంది. నీటిశాతం ఎక్కువ కాబట్టి శరీరాన్ని హైడ్రేట్‌ చేస్తుంది. దీన్ని తీసుకున్నా మంచిదే. తాజా పండ్లు, పెరుగు, ఫైబర్‌ ఎక్కువ ఉన్న కూరగాయల్ని తీసుకుంటే జీర్ణక్రియ వేగవంతమవుతుంది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్