రంగుల వేళ.. జాగ్రత్త!

వెదజల్లే రంగులు, రంగు నీటి పిచికారీలు, స్నేహితులతో కోలాహలం.. వీటన్నింటి మధ్యా ఆరోగ్యాన్ని మరవొద్దు. ఈ కొన్ని జాగ్రత్తలు తీసుకోండి!

Updated : 19 Oct 2022 16:08 IST

వెదజల్లే రంగులు, రంగు నీటి పిచికారీలు, స్నేహితులతో కోలాహలం.. వీటన్నింటి మధ్యా ఆరోగ్యాన్ని మరవొద్దు. ఈ కొన్ని జాగ్రత్తలు తీసుకోండి!

* కృత్రిమ రంగుల్లో కాపర్‌ సల్ఫేట్‌, అల్యూమినియం బ్రొమైడ్‌, మెర్క్యురీ సల్ఫైడ్‌ వంటి హానికార రసాయనాలుంటాయి. ఇవన్నీ ఊపిరితిత్తులకీ హాని కలిగించేవే. శ్వాస సంబంధిత సమస్యలున్న వారు వీటికి వీలైనంత దూరంగా ఉండాలి. మాస్క్‌ను తప్పక పెట్టుకోవాలి. సంబంధిత మందులనూ దగ్గర ఉంచుకోవడం మంచిది. ఆస్తమా ఉన్నవారు ముందుగానే ఇన్‌హేలర్‌ సాయం తీసుకోవాలి.

* చాలామంది అమ్మాయిలు అందం దృష్ట్యా కళ్లజోడుకు బదులు కాంటాక్ట్‌ లెన్స్‌ను ఉపయోగిస్తుంటారు. రంగులు వాటిపై పడ్డప్పుడు దురద, మంటలకు కారణమవొచ్చు. కాబట్టి, వాటిని ఉపయోగించకపోవడమే మంచిది. కళ్లజోడును ఆశ్రయించడమే మంచిది. నేత్ర సంబంధ సమస్యల్లేని వారూ దీన్ని ఆచరించాలి.

శరీరమంతా కప్పి ఉంచే దుస్తులకే ప్రాధాన్యమివ్వాలి. లేదంటే అలర్జీల ప్రమాదముంటుంది. వీలైనంత వరకూ చేనేత వాటినే ఎంచుకోవాలి. మిగతావి తడిసినప్పుడు చర్మానికి ఒరుసుపోయి దురద, మంటలకు కారణమవుతాయి. చేనేత వస్త్రాలైతే తడిని పీల్చుకోవడమే కాదు.. త్వరగా ఆరతాయి కూడా.

* పీరియడ్‌లో ఉంటే.. హీటింగ్‌ ప్యాడ్‌లను ఉపయోగించడం మంచిది. అలాగే ప్యాడ్‌లకు బదులుగా టాంపూన్‌లను ఎంచుకోవాలి. నీటిలో తడిసినా భయముండదు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్