ఆరోగ్యానికి ఆకుపచ్చని రసాలు...

మాలతికి రోజూ పండ్లరసం తాగడం అలవాటు. అయితే చక్కెర స్థాయులు పెరిగే ప్రమాదం ఉందేమోననే అనుమానం ఆమెకు మొదలైంది. వీటికి బదులు ఆకుపచ్చని రసాలను తీసుకుంటే ప్రయోజనాలెక్కువగా ఉంటాయంటున్నారు

Updated : 19 Mar 2022 06:06 IST

మాలతికి రోజూ పండ్లరసం తాగడం అలవాటు. అయితే చక్కెర స్థాయులు పెరిగే ప్రమాదం ఉందేమోననే అనుమానం ఆమెకు మొదలైంది. వీటికి బదులు ఆకుపచ్చని రసాలను తీసుకుంటే ప్రయోజనాలెక్కువగా ఉంటాయంటున్నారు నిపుణులు. ప్రత్యేకంగా ఏం సూచిస్తున్నారంటే...

పోషకవిలువలతో... యాంటీఆక్సిడెంట్స్‌ పుష్కలంగా ఉండే తోటకూర, కొత్తిమీర, కరివేపాకు, పుదీనా, బ్రకోలీ, గోధుమగడ్డి వంటి వాటితో తయారుచేసే రసాలు వ్యాధినిరోధక శక్తిని పెంచుతాయి. విటమిన్లు, ఖనిజలవణాలు, ఫైటో న్యూట్రియంట్లు క్లోరోఫిల్‌, కెరోటినాయిడ్స్‌ వంటివి ఈ రసాల్లో నిండుగా ఉంటాయి. ఇవన్నీ శరీరంలోని మలినాలను బయటకు పంపుతాయి. దీంతో జీర్ణవ్యవస్థ మెరుగు పడుతుంది. చర్మం, జుట్టు ఆరోగ్యంగా ఉంటాయి.

పచ్చని పండ్లతో.. కివీ, గ్రీన్‌ యాపిల్‌, జామ, ద్రాక్ష వంటివి కూడా ఈ తరహా పచ్చరసాల్లోకి వస్తాయి. ఈ వర్ణం పండ్లలో ఉండే కెరోటినాయిడ్స్‌, విటమిన్లు  శరీరాన్ని శక్తిమంతం చేస్తాయి. ఈ రసాలను క్రమం తప్పక తీసుకుంటే మహిళల్లో తరచూ కనిపించే నీరసం, బలహీనత వంటివి దూరం చేయొచ్చు. అయితే వీలైనంత చక్కెరను కలపకుండా తీసుకోవడం మంచిది. అలాగే ఆకుపచ్చని కూరగాయలు క్యాబేజీ, కీర వంటివాటిలో ఏ, కే, సీ విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. అంతే కాదు వీటిద్వారా అందే ఐరన్‌ మహిళలను అనారోగ్యాల బారిన పడకుండా కాపాడుతుంది. నిత్యం ఆరోగ్యంగానూ ఉంచుతుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్