మ్యాట్‌తో..నొప్పి మాయం!

దుమ్ము ఇంట్లోకి చేరకుండా గుమ్మంలో మ్యాట్‌లు వేస్తుంటాం. ఇతర గదుల్లోనూ రకరకాలుగా ఉపయోగిస్తాం. వంటింటికి వచ్చే సరికి ఇది కాస్త ప్రత్యేకంగా ఉండాలట! ఎందుకంటే...

Updated : 19 Mar 2022 05:06 IST

దుమ్ము ఇంట్లోకి చేరకుండా గుమ్మంలో మ్యాట్‌లు వేస్తుంటాం. ఇతర గదుల్లోనూ రకరకాలుగా ఉపయోగిస్తాం. వంటింటికి వచ్చే సరికి ఇది కాస్త ప్రత్యేకంగా ఉండాలట! ఎందుకంటే...

మనం కొన్ని గంటలు వంటగదిలో నిలబడే ఉంటాం. ఒకేచోట 30, 40 నిమిషాల కంటే ఎక్కువ సేపు నిల్చొంటే ఆ ఒత్తిడంతా పాదాలపై పడుతుంది. ఫలితమే కాళ్లు, వెన్నునొప్పి లాంటివి. వీటికి పరిష్కారంగా యాంటీ ఫెటీగ్‌ మ్యాట్‌లు వస్తున్నాయి. ఇవి తేలికగా, మృదువుగా ఉంటాయి. ఎంతసేపు నిల్చొన్నా.. ఒత్తిడి, అలసట ఉండవు. జెల్‌/ఫోమ్‌... ఇలా ప్రత్యేక, వైవిధ్యమైన మెటీరియళ్లతోనూ రూపొందుతున్నాయి. జారి పడకుండానూ కాపాడతాయి. కాబట్టి, మందంగా ఉన్నవి ఎంచుకుంటే శరీర బరువును సులువుగా మోస్తాయి. ఇంకా.. వాటి మీద నుంచి ఒత్తిడి తీసేయగానే పూర్వపు రూపానికి వచ్చేయాలి. అప్పుడే నాణ్యమైనవిగా నమ్మొచ్చు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్