ముప్పైకే ముందు జాగ్రత్త!

ఈశ్వరికి ముప్ఫై ఏళ్లు. అంతలోనే కాళ్ల నొప్పులు. చిన్న పని చేసినా చేతి ఎముకల్లో నొప్పి మొదలు. అరకిలోమీటరు నడవడానికి కూడా కాళ్లు సహకరించడం లేదు. అయితే ముప్ఫై దాటినప్పటినుంచే మహిళల్లో ఎముకలు బలంగా ఉండటానికి స్వీయ జాగ్రత్తలు తీసుకోవాలంటున్నారు నిపుణులు.

Updated : 20 Mar 2022 06:20 IST

ఈశ్వరికి ముప్ఫై ఏళ్లు. అంతలోనే కాళ్ల నొప్పులు. చిన్న పని చేసినా చేతి ఎముకల్లో నొప్పి మొదలు. అరకిలోమీటరు నడవడానికి కూడా కాళ్లు సహకరించడం లేదు. అయితే ముప్ఫై దాటినప్పటినుంచే మహిళల్లో ఎముకలు బలంగా ఉండటానికి స్వీయ జాగ్రత్తలు తీసుకోవాలంటున్నారు నిపుణులు. లేదంటే మెనోపాజ్‌ దాకా రాకుండానే ఎముకలు మరింత బలహీనపడతాయంటున్నారు. వారేం సూచిస్తున్నారంటే...

కూరగాయలు.. ఇంటిల్లపాదికీ వండిపెట్టి, పిల్లల సంరక్షణలో పడి వారి ఆరోగ్యంపట్ల అలక్ష్యం చేస్తారు చాలామంది మహిళలు. ఇది తీవ్ర ప్రభావం చూపిస్తుంది. ఎన్ని పనులున్నా.. ఆహారం పట్ల అశ్రద్ధ చేయవద్దు. పోషకవిలువలు పుష్కలంగా ఉండే కూరగాయలను రోజూ ఆహారంలో ఉండేలా జాగ్రత్తపడాలి. వీటి ద్వారా అందే క్యాల్షియం ఎముక సాంద్రతను పెంచుతుంది. వయసు పైబడినప్పుడు వచ్చే ఆస్టియో పెనియా, ఆస్టియోపొరోసిస్‌ వంటి అనారోగ్యాలు రాకుండా రక్షిస్తాయి. బ్రొకోలీ, క్యాబేజీ వంటి ఆకుపచ్చని కూరగాయలు, ఆకుకూరలు ఎముకలను ఆరోగ్యంగా ఉంచుతాయి. సి విటమిన్‌, యాంటీ ఆక్సిడెంట్స్‌ ఉండే పండ్లు ఎంచుకోవాలి. ఇవి ఎముకలను ఆరోగ్యంగా ఉంచే కణాల ఉత్పత్తికి తోడ్పడి, పటిష్టంగా ఉంచుతాయి.

వ్యాయామంతో... యుక్తవయసు నుంచి చేసే వ్యాయామాలు ఎముకలను బలోపేతం చేస్తాయి. ఎముకల సాంద్రతను పెంచి ఆరోగ్యాన్ని పరిరక్షిస్తాయి. అరగంట నడక, స్కిప్పింగ్‌, మెట్లు ఎక్కడం, దిగడం సహా చిన్నచిన్న బరువులెత్తే వ్యాయామాలు చేస్తూంటే ఏ వయసులోనైనా ఆరోగ్యంగా అడుగులేయొచ్చు.

ప్రొటీన్లు.. ఎముకలకు అందే క్యాల్షియం తయారీలో 50 శాతం ప్రొటీన్లదే. ఇందుకోసం పాల ఉత్పత్తులు, గింజ ధాన్యాలు వంటి ఆహారాన్ని తీసుకోవడం తప్పనిసరి. 30 ఏళ్లు నిండిన మహిళలు రోజూ 86-100 గ్రాముల ప్రొటీన్‌ను తీసుకుంటే మంచిది. అలాగే డి, కె విటమిన్లున్న ఆహారాన్ని ఎంపిక చేసుకోవాలి. తగినన్ని క్యాలరీలు ఉండే ఆహారాన్ని తీసుకోవాలి. లేదంటే జీవక్రియలు సమతుల్యం కావు. దీంతోపాటు బరువు పెరగకుండా జాగ్రత్తలు తీసుకుంటే, మెనోపాజ్‌లోనూ ఎముకలు ఆరోగ్యంగా ఉంటాయి.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్