మండుటెండల్లో...కడుపులో చల్లగా!

వేసవిలో కాలానుగుణంగా లభించే పండ్లతో సలాడ్లు చేసుకుని తింటే ఆరోగ్యానికి మంచిది. ఈ కాలంలో వచ్చే కీరా, బొప్పాయి, కర్బూజాల్లో నీటిశాతం ఎక్కువగా ఉండటంతోపాటు పోషకాలు, పీచు సమృద్ధిగా

Updated : 22 Mar 2022 05:06 IST

వేసవిలో కాలానుగుణంగా లభించే పండ్లతో సలాడ్లు చేసుకుని తింటే ఆరోగ్యానికి మంచిది. ఈ కాలంలో వచ్చే కీరా, బొప్పాయి, కర్బూజాల్లో నీటిశాతం ఎక్కువగా ఉండటంతోపాటు పోషకాలు, పీచు సమృద్ధిగా ఉంటాయి. వీటితో వేసవిలో చల్లగా గడిపెయ్యండి మరి..

సలాడ్ల వల్ల శరీరానికి పోషకాలు లభిస్తాయి. అంతే కాదు మధ్య మధ్యలో తీసుకోవడం వల్ల ఆకలి వేయదు. బరువూ నియంత్రణలో ఉంటుంది. ఈ సలాడ్లను పచ్చిగా, పప్పు, అన్నం, కూరగాయలతో కలిపి తీసుకోవచ్చు. ఇవి పొట్టను తేలికగా, బరువును అదుపులోనూ ఉంచుతాయి. తేలిగ్గా చేసుకోగలిగే రెండు సలాడ్లను చూడండి...

పుచ్చపండుతో...

కావాల్సినవి: పుచ్చకాయ ముక్కలు- నాలుగు కప్పులు, కీరా- రెండు (గుండ్రంగా చక్రాల్లా తరగాలి), నిమ్మకాయ - ఒకటి (రసం తీసి పెట్టుకోవాలి), నల్ల ఉప్పు, చాట్‌ మసాలా- తగినంత, యాపిల్‌, కమలాపండు ముక్కలు- రెండు కప్పులు.
తయారీ: పెద్ద గిన్నెలో పుచ్చపండు, కీరా, యాపిల్‌, కమలా పండు ముక్కలు వేసి కలపాలి. దీంట్లో నల్ల ఉప్పు, చాట్‌ మసాలా, కాస్తంత నిమ్మరసం కలిపి కాసేపటి తర్వాత తింటే చాలా బాగుంటుంది.
కీరాతో.. వేసవిలో అధికంగా దొరికే కీర దోసకాయ శరీరానికి చలువ చేస్తుంది. దీంట్లో నీరు సమృద్ధిగా ఉండటం వల్ల దీన్ని తీసుకుంటే దాహం తగ్గుతుంది, కడుపు నిండినట్టనిపిస్తుంది. బరువు తగ్గాలనుకునేవారు దీన్ని ఎక్కువగా తీసుకోవాలి.
కావాల్సినవి: కీరా- రెండు, నిమ్మకాయ- ఒకటి, వేయించిన జీలకర్ర పొడి - అర చెంచా, ఉప్పు- తగినంత
తయారీ: కీరాను శుభ్రంగా కడిగి పొట్టు తీయాలి. చక్రాల్లా కోసి పెద్ద గిన్నెలో వేయాలి. దీంట్లో వేయించిన జీలకర్ర పొడి, ఉప్పు వేసి, నిమ్మరసం చల్లి బాగా కలపాలి. అంతే చల్లచల్లని కీరా సలాడ్‌ సిద్ధం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్