పొట్టా... ఒత్తిడి తగ్గించుకోండి!

అందానికి అడ్డం... ఆరోగ్యానికి హానికరం... అందరిలోకి వెళ్లాలంటే ఆత్మన్యూనత.. నచ్చిన దుస్తులు పట్టకపోవడం... పెరిగిన పొట్టతో పడే బాధలు అన్నీ ఇన్నీ కావు.. మరి ఈ పొట్టను కరిగించాలంటే...

Published : 23 Mar 2022 01:31 IST

 

అందానికి అడ్డం... ఆరోగ్యానికి హానికరం... అందరిలోకి వెళ్లాలంటే ఆత్మన్యూనత.. నచ్చిన దుస్తులు పట్టకపోవడం... పెరిగిన పొట్టతో పడే బాధలు అన్నీ ఇన్నీ కావు.. మరి ఈ పొట్టను కరిగించాలంటే...
* చక్కెరలు తగ్గించేయాలి. ఇవి అధిక మోతాదులో ఉండే శీతల పానీయాలకు వీలైనంత దూరంగా ఉండాలి.
*ప్రతి భోజనానికీ ముందు గ్లాసు నీళ్లు తాగాలి. నీళ్లు తగినన్ని తాగడం శరీరంలోని వ్యర్థాలు బయటకు వెళ్లిపోవడానికి, చర్మం తాజాగా మారడానికి చాలా అవసరం. అలాగే పొట్ట తగ్గడానికి కూడా.
* పొట్ట తగ్గాలంటే నడక తప్పనిసరి. రోజూ కచ్చితంగా ఓ అరగంటైనా నడవాల్సిందే. స్క్వాట్స్‌, పుష్‌-అప్స్‌, లాంజ్‌, ప్లాంక్స్‌, బోట్‌ పోజ్‌, బైసైకిల్‌ క్రంచ్‌.. ఇవన్నీ పొట్టను తగ్గించే వ్యాయామాలే... కాబట్టి రోజూ ఏదో ఒకటి ప్రయత్నిస్తూనే ఉండాలి.  
* ఉప్పు వాడకాన్ని తగ్గించాలి.  
*పొట్టను లోపలికి లాక్కుని కొన్ని సెకన్లపాటు ఉండాలి. ఇలా రోజులో కొన్నిసార్లు చేయాలి.
* ప్రాసెస్డ్‌, చక్కెరలుండే పదార్థాలకు బదులుగా తాజా పండ్లు, కూరగాయలను రోజూ తినాలి. చిరుధాన్యాలను ఆహారంలో చేర్చుకోవాలి. మాంసకృత్తులుండే చికెన్‌, మటన్‌, పాల ఉత్పత్తులు; చేపలను ఆహారంలో చేర్చుకోవాలి. అల్పాహారాన్ని వదిలేయొద్దు. నిద్ర లేచిన రెండు మూడు గంటల్లోపు పోషకాలుండే అల్పాహారాన్ని తినాలి.
* ఒత్తిడి, ఆందోళనల వల్ల కార్టిసాల్‌ అనే హార్మోన్‌ అధికంగా విడుదల అవుతుంది. ఇది పొట్ట ప్రాంతంలో కొవ్వు/బరువు పెరగడానికి ప్రోత్సహిస్తుంది. కాబట్టి మీరు ప్రశాంతంగా ఉండటానికి ప్రయత్నించాలి. రోజూ దాదాపు ఏడెనిమిది గంటలు నిద్రపోవాలి.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్