హృద్రోగానికి దూరంగా...

అమలకు 45 నిండాయి. తరచూ ఛాతీ నొప్పి అంటోంది. అది గుండె జబ్బేమో అని కూడా భయపడుతోంది. ఇలా ఆందోళనకు గురికాకుండా ఉండాలంటే 40 నిండినప్పటి నుంచి మహిళలకు ఏటా

Published : 24 Mar 2022 01:37 IST

అమలకు 45 నిండాయి. తరచూ ఛాతీ నొప్పి అంటోంది. అది గుండె జబ్బేమో అని కూడా భయపడుతోంది. ఇలా ఆందోళనకు గురికాకుండా ఉండాలంటే 40 నిండినప్పటి నుంచి మహిళలకు ఏటా వైద్యపరీక్షలు తప్పనిసరి అంటున్నారు వైద్యనిపుణులు.  ఇంకా ఏం జాగ్రత్తలు చెబుతున్నారంటే...

పరీక్షల్లో... నాలుగు పదులు దాటాక వైద్య పరీక్షలు తప్పనిసరి. సమస్యలుంటే వీటితో బయట పడతాయి. అలాగే రానున్న అయిదేళ్లలో వచ్చే అనారోగ్యాలు పసిగట్టొచ్చు. దాంతో ముందస్తు జాగ్రత్తలు తీసుకోవచ్చు. మధుమేహం, రక్తపోటు, కొలెస్ట్రాల్‌ వంటి సమస్యలు ప్రాథమిక స్థాయిలో ఉంటే, వాటివల్ల వెంటనే ప్రమాదం కాకపోవచ్చు. అయితే ఇవి తీవ్ర అనారోగ్య సమస్యలకు దారితీయొచ్చు. అందుకే ముందస్తుగా గుర్తిస్తే వాటిని అదుపులో ఉంచుకోవచ్చు.

పోషకాహారం.. పోషకాహారానికి పెద్దపీట వేయాలి. లేదంటే హృద్రోగ ముప్పు ఉంది. తాజా పండ్లు, కూరగాయలు, ఆకుకూరలు, పప్పు ధాన్యాలను తీసుకోవాలి. ఉప్పును వీలైనంత తగ్గించాలి. రోజూ 5 గ్రాముల కన్నా ఎక్కువ ఉప్పును వాడŸకూడదని ప్రపంచ ఆరోగ్య సంస్థ చెబుతోంది. అప్పుడే రక్తపోటును నియంత్రణలో ఉంచుకోవచ్చు. నిల్వ ఆహారానికి దూరంగా ఉండాలి, నూనె పదార్థాలను తగ్గించాలి.

కండరాలకు కదలిక.. రోజు అరగంట సేపైనా వ్యాయామం ఉంటే కండరాల్లో కదలిక ఉంటుంది. రక్తప్రసరణ సవ్యంగా జరిగి, గుండె పనితీరును మెరుగుపరుస్తుంది. ఉదయం లేదా సాయంత్రం కాసేపు నడవడం మంచిది. ఒకే చోట గంటల తరబడి కూర్చోకుండా ఇంట్లోనైనా అటూ ఇటూ అడుగులేస్తే మరీ మంచిది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్