జుట్టు ఊడుతోందా...

జుట్టు రాలడానికి కారణాలు బోలెడు. దాన్ని అడ్డుకుంటూ, ఒత్తుగా పెరిగేలా చేసుకోవచ్చు. అదీ ఇంట్లో ఉండే పదార్థాలతోనే. అవేంటో.. ఎలా వాడాలో తెలుసుకుందామా...

Published : 27 Mar 2022 00:50 IST

జుట్టు రాలడానికి కారణాలు బోలెడు. దాన్ని అడ్డుకుంటూ, ఒత్తుగా పెరిగేలా చేసుకోవచ్చు. అదీ ఇంట్లో ఉండే పదార్థాలతోనే. అవేంటో.. ఎలా వాడాలో తెలుసుకుందామా...

ఉల్లిరసం... ఉల్లి ఆరోగ్యానికే కాదు అందానికీ సాయపడుతుంది. ఉల్లిరసాన్ని జుట్టుకు పట్టిస్తే బోలెడు లాభాలు. ఇది కురులు ఒత్తుగా పెరగడానికి దోహద పడుతుంది. చుండ్రును తగ్గించి కేశాలను కాంతులీనేలా చేస్తుంది. రెండు చెంచాల ఉల్లిరసంలో చెంచా తేనె కలిపి జుట్టుకు పట్టించి 20 నిమిషాల తర్వాత కడిగేసి చూడండి.

పెరుగు పూత... దీన్ని వేసుకుంటే జుట్టు రాలడం తగ్గి చక్కగా పెరుగుతుంది. సహజంగా వెంట్రుకలు నల్లగా మారేలా చేస్తుంది. మాడు ఆరోగ్యాన్ని రక్షిస్తుంది.

అర కప్పు పెరుగులో రెండు పెద్ద చెంచాల నిమ్మరసం, పెద్ద చెంచా తేనె వేయాలి. వీటిని బాగా కలిపి మాడుకు పట్టించాలి. ఈ పూతను గంటపాటు ఆరనిచ్చి ఆ తర్వాత గోరువెచ్చని నీటితో కడిగేయాలి. తేనె మాడుకు తేమను అందిస్తే పెరుగు, నిమ్మ... చుండ్రుతో పోరాడతాయి.

ఉసిరి... జుట్టుకు పోషణనిచ్చి రాలడాన్ని నియంత్రిస్తుంది. తేమగా ఉంచుతుంది.

పెద్ద చెంచా చొప్పున ఉసిరి పొడి, నిమ్మరసాలను ఓ చిన్న  గిన్నెలో కలపాలి. ఈ మిశ్రమాన్ని తలకు పట్టించి అయిదు నిమిషాలు మర్దనా చేయాలి. పది నిమిషాల తర్వాత గాఢత తక్కువగా ఉండే షాంపూతో కడిగేయాలి.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్