స్నానంలో హడావుడెందుకు?

చాలా మంది స్నానాన్ని హడావుడిగా ముగిస్తారు. కానీ అందంతో పాటు ఆరోగ్యానికీ శుభ్రంగా స్నానం చేయడం అవసరం అంటున్నారు నిపుణులు. శిరోజాల నుంచి పాదాల వరకు రోజూ శుభ్రపరచాల్సిన ప్రాంతాలున్నాయంటున్నారు. దీంతో సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉండొచ్చని సూచిస్తున్నారు.

Published : 27 Mar 2022 00:59 IST

చాలా మంది స్నానాన్ని హడావుడిగా ముగిస్తారు. కానీ అందంతో పాటు ఆరోగ్యానికీ శుభ్రంగా స్నానం చేయడం అవసరం అంటున్నారు నిపుణులు. శిరోజాల నుంచి పాదాల వరకు రోజూ శుభ్రపరచాల్సిన ప్రాంతాలున్నాయంటున్నారు. దీంతో సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉండొచ్చని సూచిస్తున్నారు.

శిరోజాలు.. వారానికి మూడు సార్లైనా తలస్నానం తప్పనిసరి. లేదంటే మాడుపై మురికి చేరి శిరోజాలు రాలే సమస్య మొదలవుతుంది. అరగంట ముందు కొబ్బరి నూనెతో మర్దనా చేసి, ఆ తర్వాత చేసే తలస్నానం శిరోజాలను ఆరోగ్యంగా ఉంచుతుంది. ముఖానికి అందాన్నిచ్చే జుట్టు మరింత మృదువుగా కనిపిస్తుంది.

బాహుమూలలు.. కాలాలతో నిమిత్తం లేకుండా చెమట సమస్య ఉంటుంది. వేసవిలో అయితే అందరికీ ఉంటుంది. బాహుమూలల్లో ఎక్కువగా చెమట పట్టి, మురికి దాంతోపాటు బ్యాక్టీరియా చేరుతుంది. ఇరుకుగా ఉండే ఆ ప్రాంతాన్ని రోజూ రెండు పూటలా శుభ్ర పరచకపోతే దురద, అలర్జీలు, చర్మసమస్యలు వస్తాయి. దుర్వాసనా మొదలవుతుంది.

జననేంద్రియాలు.. రోజూ లోదుస్తులను మార్చడం, జననేంద్రియాల పరిశుభ్రత తప్పనిసరి. గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవడం ఆరోగ్యకరం. లేదంటే బ్యాక్టీరియా చేరి తీవ్రమైన అనారోగ్యాలకు దారి తీసే ప్రమాదం ఉంటుంది. అంతేకాదు, మెత్తని, మృదువైన కాటన్‌ లోదుస్తులనే వాడాలి. ఇవి సౌకర్యంగా ఉండటమే కాదు, ఆరోగ్యాన్నీ ఇస్తాయి.

పాదాలు.. రోజంతా శరీరం బరువును మోసే పాదాలను ఆరోగ్యంగా ఉండేలా చూసుకోవడం తప్పనిసరి. శరీరంలో ఇవీ ఒక భాగమే అని మరవకూడదు. రాత్రి నిద్రపోయే ముందు గోరువెచ్చని నీటిలో ఒక నిమ్మచెక్క రసాన్ని పిండి, అందులో పాదాలను అరగంట సేపు ఉంచి ప్యుమిస్‌ స్టోన్‌తో శుభ్రపరచాలి. దీంతో మురికి పోయి పగుళ్ల సమస్య ఉండదు. రోజంతా నడిచిన అలసటా దూరమవుతుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్