గర్భిణికి ఔషధ నీళ్లు...

కమల అయిదు నెలల గర్భిణి. అప్పుడప్పుడు నీరసంతో అడుగు కూడా వేయలేకపోతోంది. పోషక విలువలున్న ఆహారం, తగినంత నీటిని తీసుకోవడంలో  అశ్రద్ధ చెయ్యడమే దీనికి కారణమంటున్నారు నిపుణులు. శరీరానికి కావాల్సిన పోషకాలు, ఖనిజ లవణాలు అందేలా, జీవక్రియలు సక్రమంగా జరిగేలా ఉదయం

Published : 28 Mar 2022 01:00 IST

కమల అయిదు నెలల గర్భిణి. అప్పుడప్పుడు నీరసంతో అడుగు కూడా వేయలేకపోతోంది. పోషక విలువలున్న ఆహారం, తగినంత నీటిని తీసుకోవడంలో  అశ్రద్ధ చెయ్యడమే దీనికి కారణమంటున్నారు నిపుణులు. శరీరానికి కావాల్సిన పోషకాలు, ఖనిజ లవణాలు అందేలా, జీవక్రియలు సక్రమంగా జరిగేలా ఉదయం ఆల్కలైన్‌ నీటిని తాగాలని సూచిస్తున్నారు. ఇది ఔషధంలా పనిచేసి తల్లితోపాటు పుట్టబోయే బిడ్డకు ఆరోగ్యాన్ని అందిస్తుందంటున్నారు.

తయారీ.. కాచి వడకట్టిన లీటరు నీళ్లను తీసుకోవాలి. ఇందులో అర చెక్క నిమ్మకాయ రసాన్ని పిండాలి. మరో అర చెక్క నిమ్మను పలుచని చక్రాలుగా కోసి ఈ నీటిలో వేయాలి. చెంచాలో ఎనిమిదో వంతు పింక్‌ సీ సాల్ట్‌ను వేసి బాగా కలిపి సీసా మూత పెట్టాలి. రాత్రంతా లేదా ఎనిమిది నుంచి తొమ్మిది గంటలు నాననివ్వాలి. ఇలా తయారైన ఆల్కలైన్‌ నీటిని పర గడుపున తీసుకోవాలి.

ప్రయోజనాలు... సాధారణ నీటితో పోలిస్తే ఇందులో పీహెచ్‌ స్థాయులు రెట్టింపు. ఇది శరీరంలోని అసిడిటీని తగ్గిస్తుంది. ఆహారాన్ని తేలికగా జీర్ణమయ్యేలా చేస్తుంది. మనం తీసుకునే ఆహారాల్లో కొన్ని అసిడిటీని పెంచేలా ఉండి, అజీర్తి, కడుపునొప్పి వంటి పలురకాల అనారోగ్యాలను తెచ్చిపెడతాయి. ఈ ఆల్కలైన్‌ నీళ్లలోని పీహెచ్‌ స్థాయులు ఇలాంటి సమస్యలను దరిచేరకుండా రక్షిస్తాయి. ఇందులోని క్యాల్షియం ఎముకల బలహీనతను దూరం చేస్తుంది. అలాగే గర్భిణుల్లో రక్తపోటును అదుపు చేసే మెగ్నీషియం ఈ నీటితో అందుతుంది. సోడియం, పొటాషియం కండరాలను శక్తిమంతంగా మార్చి వ్యాధినిరోధకతను పెంచుతాయి. ఇందులోని యాంటీఆక్సిడెంట్స్‌ ఫ్రీరాడికల్స్‌ను నశింపజేస్తాయి.  శరీరంలోని మలినాలు బయటకుపోయి, జీర్ణ శక్తి పెరుగుతుంది. అధిక బరువు సమస్య ఉండదు. ఇందులోని పోషకాలు జీర్ణాశయంలో అధికంగా ఉత్పత్తి అయ్యే ఆమ్లాలను పలుచన చేసి జీర్ణ సంబంధ సమస్యలను రానివ్వవు. డీహైడ్రేషన్‌ దూరమై, నిస్సత్తువ నుంచి బయటపడొచ్చు. ఈ ప్రయోజనాలన్నీ తల్లి ఆరోగ్యాన్ని రక్షించడంతోపాటు బిడ్డ ఎదుగుదలలోనూ తోడ్పడతాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్