పాపాయి జాగ్రత్త..!

మీరు ఎక్కడికి వెళ్లినా మీ చిన్నారికి ఎండ తగలకుండా చూడండి. ఎందుకంటే వారి శరీరం అధిక వేడిని/ ఉష్ణోగ్రతను తట్టుకోలేదు. కాబట్టి వారు నీడపట్టునే ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలి.

Updated : 02 Apr 2022 00:26 IST

ఎండలు పెరుగుతున్నాయి. ఈ సమయంలో పెద్ద వాళ్లం మనకే గాబరాగా అవుతోంది. మరి చిన్నారుల సంగతి ఏంటి? అందుకే వాళ్లను ఈ కాలంలో మరింత జాగ్రత్తగా చూసుకోవాలి. అందుకేం చేయాలంటే...

* ఎండ నుంచి దూరంగా... మీరు ఎక్కడికి వెళ్లినా మీ చిన్నారికి ఎండ తగలకుండా చూడండి. ఎందుకంటే వారి శరీరం అధిక వేడిని/ ఉష్ణోగ్రతను తట్టుకోలేదు. కాబట్టి వారు నీడపట్టునే ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలి.

* చల్లగా ఉండేలా దుస్తులు.. బయటి వాతావరణం వేడిగా ఉన్నప్పుడు చిన్నారులకు తేలికైన, నూలు వస్త్రాలను వేయాలి. ఇవి సింథటిక్‌, ఇతర ఫ్యాబ్రిక్స్‌ కంటే చెమటను ఎక్కువగా పీల్చేసుకుంటాయి.

* గాలి తగిలేలా... ఇంట్లో వీలైనంత గాలి వచ్చేలా చూడాలి. అధిక వేడి వల్ల ఉక్కపోత, చెమటతో బుజ్జాయి ఉక్కిరి బిక్కిరి అయిపోతాడు. కాబట్టి ఎక్కువ గాలి తగిలేలా చూడాలి.

స్నానం... రెండు పూటలా స్నానం చేయించాలి. వీలైతే చిన్న వాటర్‌ టబ్‌లో కాసేపు ఆడించండి. శరీరానికి చల్లదనం అందడంతోపాటు చిన్నారులు సంతోషంతో కేరింతలు కొడతారు.

* టాల్కమ్‌ తప్పనిసరి... ఈ కాలంలో పిల్లల చర్మ సంరక్షణ కోసం ప్రత్యేక చర్యలు తీసుకోవాలి. స్నానం తర్వాత శరీరమంతా టాల్కమ్‌ పౌడర్‌ అద్దాలి. ఇది వారి చర్మానికి రక్షణగా ఉండటంతోపాటు సువాసననూ అందిస్తుంది.

* ఎక్కువ నీటిని అందించాలి. వీలైతే సిప్పర్‌లో నీళ్లు పోసి పెడితే సరి. శరీరం నిర్జలీకరణం కాకుండా చూసుకోవాలి. అధిక వేడి వల్ల చెమట రూపంలో పోషకాలను కోల్పోతుంది. కాబట్టి కొద్ది మొత్తంలో పండ్లరసాలు, ద్రవాలు ఎప్పటికప్పుడు తాగిస్తుండటం మరవొద్దు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్