కీరాతో.. అందం, ఆరోగ్యం

ఎండలు మండిపోతున్నాయి. వీటి తీవ్రతకు తోడు వంటింట్లో పొయ్యి వేడికి తట్టుకోలేక ఇల్లాళ్లు మరింత నీరసించిపోతుంటారు. దాన్నుంచి తేరుకోవడానికి కీరా దోసకాయ మహత్తరంగా పనిచేస్తుంది. ఎలానో చూడండి...

Updated : 09 Apr 2022 06:06 IST

ఎండలు మండిపోతున్నాయి. వీటి తీవ్రతకు తోడు వంటింట్లో పొయ్యి వేడికి తట్టుకోలేక ఇల్లాళ్లు మరింత నీరసించిపోతుంటారు. దాన్నుంచి తేరుకోవడానికి కీరా దోసకాయ మహత్తరంగా పనిచేస్తుంది. ఎలానో చూడండి...

* వేడిని పోగొట్టి సేదతీర్చడంలో కీరా దోస భేషనిపించుకుంటుంది. ఇందులో నీటి శాతం   చాలా ఎక్కువ కనుక ఈ కాలంలో ఎదురయ్యే డీహైడ్రేషన్‌ సమస్యను నివారిస్తుంది.

* సి, కె విటమిన్లు, పొటాషియం, మెగ్నీషియంలు సమృద్ధిగా ఉంటాయి. అందుకే ఇది మంచి పోషకాహారం. రోగనిరోధక శక్తిని పెంచుతుంది. ఈ కాలంలో రోజూ ఒక కీరా దోస తింటే చర్మానికి మృదుత్వం చేకూరుతుంది.

* కీరా  ముక్కలను కళ్ల మీద పెట్టుకుంటే చలవ. కళ్లు ఎర్రబారడం, దురద, మంటలకు ఔషధంలా పనిచేస్తుంది.

* క్యాన్సర్‌ నిరోధక గుణాలున్నందున మనల్ని భయపెడుతున్న రొమ్ము, అన్నాశయ క్యాన్సర్ల నుంచి రక్షణ ఇస్తుంది.

శరీరంలో దోష గుణాలను నివారిస్తుంది. దీని గుజ్జును ఫేస్‌ ప్యాక్‌లా పెట్టుకుంటే ముఖానికి తేటదనం వస్తుంది. చర్మం మీది మలినాలు, మృతకణాలు నశించి మెరుపు వస్తుంది. రుబ్బేంత సమయం లేకపోతే వాటి ముక్కలు గ్లాసుడు నీళ్లలో వేసి గంట తర్వాత ఆ నీళ్లతో ముఖం కడుక్కున్నా ఫలితం ఉంటుంది.

* రక్తపోటును నివారిస్తుంది. పీచు అధికంగా ఉన్నందున జీర్ణ ప్రక్రియను మెరుగు పరుస్తుంది. వ్యర్థాలను తొలగించి, పొట్ట, పేగులను శభ్రపరుస్తుంది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్