ఆరోగ్యమే.. పానక రహస్యం

శ్రీరామనవమి అనగానే గుర్తొచ్చేది పానకం. పేరుకు ప్రసాదమే అయినా ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఈ కాలంలో వచ్చే ఎన్నో సమస్యలకు చెక్‌ పెడుతుంది.

Published : 10 Apr 2022 02:05 IST

శ్రీరామనవమి అనగానే గుర్తొచ్చేది పానకం. పేరుకు ప్రసాదమే అయినా ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఈ కాలంలో వచ్చే ఎన్నో సమస్యలకు చెక్‌ పెడుతుంది.

* పానకంలో వేసే బెల్లం, మిరియాల పొడి, తులసి ఆకులు, శొంఠి... అన్నీ ఔషధ గుణాలున్నవే. రామ నవమి వేసవిలో వస్తుంది కనుక గ్రీష్మ తాపాన్ని తగ్గిస్తుందని దాన్ని ప్రసాదంలో చేర్చారు మన పెద్దలు.

* బెల్లంలో ఇనుము, పొటాషియం, భాస్వరం తదితరాలు ఉన్నందున వెంటనే శక్తి లభిస్తుంది. రక్తహీనత బారిన పడనివ్వదు. రక్తాన్ని శుద్ధిచేస్తుంది. రక్తపోటును అదుపులో ఉంచుతుంది. నెలసరి సమస్యలను తగ్గిస్తుంది. కాలేయాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. అసిడిటీ, జీర్ణసమస్యలూ దూరమవుతాయి.

* ఎండలకు చిన్నారులు త్వరగా అలసిపోతుంటారు. ఆ నీరసం పానకంతో తగ్గుతుంది. అలాగే ఆటపాటల్లో ఉండే పిల్లలకు ఈదురు గాలుల వల్ల అలర్జీలు వస్తుంటాయి. మిరియాలు, తులసి ఆకుల్లో దగ్గు, కఫాలను తగ్గించే ఔషధ గుణాలున్నందున వాటి నుంచి ఉపశమనం లభిస్తుంది. ఉబ్బసానికి కూడా విరుగుడు. శొంఠిలో ఉండే యాంటీఆక్సిడెంట్లు ఆకలిని పెంచుతాయి, రోగనిరోధక శక్తినిస్తాయి.

* రుచిగానూ ఉంటుంది, ఆరోగ్యదాయకం కూడా. కనుకనే ఎవరికీ బలవంతంగా ఇవ్వనవసరం లేదు. హాయిగా తాగేస్తారు.

* పానకం తయారీ కోసం బెల్లం తరిగే శ్రమను తగ్గిస్తూ చిన్న చిన్న క్యూబ్స్‌ లేదా బెల్లం పొడి మార్కెట్లో దొరుకుతున్నాయి.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్