ఎండల్లోనూ.. కురులు ఆరోగ్యంగా!

ఎండ ప్రభావం కురులపైనా ఎక్కువే. అధిక వేడి జుట్టును నిర్జీవంగా, గడ్డిలా తయారయ్యేలా చేయడంతోపాటు మాడుపై నూనెలు ఎక్కువగా ఉత్పత్తి అవడం, జుట్టు చిట్లడం వంటి ఎన్నో సమస్యల్నీ తెచ్చిపెడుతుంది. వాటి నుంచి తప్పించుకోవాలా? వీటిని పాటిస్తే సరి.

Updated : 11 Apr 2022 02:28 IST

ఎండ ప్రభావం కురులపైనా ఎక్కువే. అధిక వేడి జుట్టును నిర్జీవంగా, గడ్డిలా తయారయ్యేలా చేయడంతోపాటు మాడుపై నూనెలు ఎక్కువగా ఉత్పత్తి అవడం, జుట్టు చిట్లడం వంటి ఎన్నో సమస్యల్నీ తెచ్చిపెడుతుంది. వాటి నుంచి తప్పించుకోవాలా? వీటిని పాటిస్తే సరి.

* కాలంలో తలస్నానం తర్వాత జుట్టును ఎక్కువ శాతం సహజంగా ఆరబెట్టుకోవడానికే ప్రాధాన్యమివ్వండి. డ్రయ్యర్‌ ఉపయోగించాలన్నా.. మరీ నీరు కారుతున్నప్పుడు కాకుండా సగం ఆరిన తర్వాతే వాడండి.
* స్టైలింగ్‌ కోసం ఏవైనా ఉత్పత్తులు ఉపయోగిస్తే రాత్రికల్లా తిరిగి తప్పక తలస్నానం చేయాలి. లేదంటే దువ్వడం లాంటి కాస్త ఒరిపిడికే వెంట్రుకలు తెగే అవకాశమెక్కువ.
* ఈ కాలంలో తరచూ తలస్నానం చేయాలి. చెమట, దాని కారణంగా ఏర్పడే జిడ్డు అలర్జీలకు కారణమవుతాయి. అలాగే తక్కువ గాఢత ఉన్న షాంపూలనే వాడాలి. మరీ చల్లని/ వేడి నీటిని వాడొద్దు. ఉపయోగించే దువ్వెనలనూ ఎప్పటికప్పుడు కడుగుతుండాలి.
* య కురుల చివర్లు మరీ పొడిబారినట్లుగా కనిపిస్తే కత్తిరించేయండి. తాజా ఆకుకూరలు, కూరగాయలకు ప్రాధాన్యమివ్వాలి. కనీసం ఎనిమిది గ్లాసుల నీళ్లు తాగాలి. నడక, చిన్నపాటి వ్యాయామాలను దినచర్యలో భాగం చేసుకోవాలి.
* వారానికోసారి పెరుగు, అలోవెరా, అరటి పండు లాంటి వాటితో జుట్టుకు పూతలు వేయాలి. అలాగే తరచూ తలకు నూనెను పెడుతుండాలి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్