నెలసరి నొప్పిని తగ్గించే జల్‌జీరా!

ఎండలు మండుతున్నాయి. ఈ సమయంలో చల్లచల్లగా.... రుచికరమైన స్పైసీ జల్‌జీరా తాగితే చాలా బాగుంటుంది. ఇది శరీరానికి చలువతోపాటు ఆరోగ్యాన్నీ ఇస్తుంది. జల్‌జీరా శరీరానికి నూతన ఉత్తేజాన్ని ఇస్తుంది. దాంతోపాటు జీర్ణక్రియను మెరుగు పరిచి గ్యాస్‌ సమస్యను దూరం చేస్తుంది. దీంట్లో వాడే నల్లుప్పు గుండెలో మంట, కడుపు ఉబ్బరాలను తగ్గించి, శరీరాన్ని డీహైడ్రేట్‌ కాకుండా చూస్తుంది....

Published : 12 Apr 2022 01:26 IST

ఎండలు మండుతున్నాయి. ఈ సమయంలో చల్లచల్లగా.... రుచికరమైన స్పైసీ జల్‌జీరా తాగితే చాలా బాగుంటుంది. ఇది శరీరానికి చలువతోపాటు ఆరోగ్యాన్నీ ఇస్తుంది.

ల్‌జీరా శరీరానికి నూతన ఉత్తేజాన్ని ఇస్తుంది. దాంతోపాటు జీర్ణక్రియను మెరుగు పరిచి గ్యాస్‌ సమస్యను దూరం చేస్తుంది. దీంట్లో వాడే నల్లుప్పు గుండెలో మంట, కడుపు ఉబ్బరాలను తగ్గించి, శరీరాన్ని డీహైడ్రేట్‌ కాకుండా చూస్తుంది.

జీలకర్రలో ఇనుము సమృద్ధిగా ఉంటుంది. ఇది రక్తహీనత రాకుండా కాపాడుతుంది.

వాంతులు, వికారంతో బాధపడే గర్భిణులు దీన్ని తాగితే ఉపశమనం లభిస్తుంది.

ఎండాకాలంలో కొందరు మహిళల్లో నెలసరి సమయంలో నొప్పి ఎక్కువగా ఉంటుంది. వీరు ఈ ద్రవాన్ని తాగితే కడుపులో నొప్పి, మంటా తగ్గు ముఖం పడతాయి. చల్లటి ఈ ద్రవం తక్షణం నెలసరి నొప్పులను తగ్గిస్తుంది.

ఎలా చేసుకోవాలంటే..

జీలకర్ర- రెండు పెద్ద చెంచాలు, ఉప్పు- తగినంత, ఇంగువ- పావు చెంచా, నల్లుప్పు- రుచికి సరిపడా, చక్కెర- పెద్ద చెంచాన్నర, అల్లం తరుగు- చెంచా, నిమ్మకాయ- ఒకటి, పుదీనా ఆకులు- కొన్ని, నీళ్లు/సోడా నీళ్లు- తగినన్ని, మంచు ముక్కలు- కొన్ని, చింతపండు గుజ్జు-చెంచా తీసుకోవాలి. ముందు జీలకర్రను సువాసన వచ్చేవరకు వేయించి, మిక్సీలోనో, రోట్లోనో వేసి బరకగా పొడి చేసుకోవాలి. ఇందులోనే తగినంత ఉప్పు, నల్లుప్పు, ఇంగువ, చక్కెర వేసి దంచాలి. ఈ బరక పొడికి తాజా పుదీనా ఆకులు, అల్లం తరుగు, కాస్తంత చింతపండు గుజ్జు జతచేసి మెత్తగా అయ్యే వరకు నూరి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు నిమ్మకాయను నాలుగైదు చక్రాలుగా కోసుకోవాలి. గ్లాసులో తయారుచేసి పెట్టుకున్న జీలకర్ర ముద్ద అర చెంచా వేసుకోవాలి. దీంట్లో నిమ్మరసం పిండాలి. ఒకట్రెండు ఐసు ముక్కలనూ వేసుకోవాలి. సోడా/చల్లని నీళ్లను పోస్తే కమ్మని మింట్‌, జల్‌జీరా రెడీ.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్