నెలసరి చైతన్యం రావాలి

నెలసరి సమయంలో ఎంతవరకు పరిశుభ్రత పాటిస్తున్నారు, ఎలాంటి పద్ధతులను పాటిస్తున్నారు, ఏం నియమాలను అనుసరిస్తున్నారు వంటి అంశాలపై ‘అవని’ అనే సంస్థ ఇటీవల ఓ సర్వే నిర్వహించింది. నెలసరి పరిశుభ్రతపై

Published : 14 Apr 2022 01:29 IST

నెలసరి సమయంలో ఎంతవరకు పరిశుభ్రత పాటిస్తున్నారు, ఎలాంటి పద్ధతులను పాటిస్తున్నారు, ఏం నియమాలను అనుసరిస్తున్నారు వంటి అంశాలపై ‘అవని’ అనే సంస్థ ఇటీవల ఓ సర్వే నిర్వహించింది. నెలసరి పరిశుభ్రతపై అవగాహన కలిగించేందుకు వెయ్యిమందితో మాట్లాడిన ఈ అధ్యయనంలో విస్తుపోయే విషయాలు వెల్లడయ్యాయి.

సమాజంలో ఇప్పటికీ నెలసరిని నిషిద్ధ అంశంగానే పరిగణిస్తున్నట్లు ఈ అధ్యయనంలో తేలింది. నెలసరిలో వంట, పూజగదిలోకి వెళ్లక పోవడం, కొన్ని పాత్రలను తాకకపోవడం, నిల్వ పచ్చళ్ల సీసా లేదా జాడీలను ముట్టుకోకపోవడం, శుభకార్యాలకు హాజరు కాకపోవడం, తులసి మొక్క సమీపానికి వెళితే అది చనిపోతుందని అటువైపు వెళ్లకపోవడం వంటివన్నీ ఇప్పటికీ సమాజంలో అక్కడక్కడా కొనసాగుతున్నట్లు ఈ అధ్యయనం ద్వారా తెలిసింది. ఆ మూడు రోజులూ తలస్నానం చేయకపోవడం, పాల ఉత్పత్తులను తీసుకోకపోవడం, వర్కవుట్లు జోలికి వెళ్లకపోవడం కూడా కనిపించాయి. ఇంకా...
33 % : మొదటిసారి నెలసరి మొదలవ్వడానికి ముందు తమకు పీరియడ్స్‌పైన అస్సలు అవగాహన లేదని చెప్పినవారు.
35 % : నెలసరి ఎందుకు వస్తుందో, దాని వెనక ఉన్న సైన్స్‌ ఏంటో తెలియదని చెప్పినవారు.
47.4% : నెలసరి ప్రారంభమైనప్పుడు తీవ్ర పొత్తికడుపు నొప్పితో బాధపడ్డారు.
88% : మొదటిసారి నెలసరి వచ్చినప్పుడు దాని గురించి చర్చించిన తొలి వ్యక్తి తల్లి.
8.2% : మొదటిసారి నెలసరి వచ్చిన సమయంలో స్నేహితురాలి సలహాను పాటించారు.
28% : చెడు చేస్తుందనే కారణంగా నెలసరి సమయంలో ఇంట్లోవాళ్లు దూరంపెట్టేవారు.  
50% కి పైగా: తీవ్ర పొత్తి కడుపు నొప్పితో బాధపడటమే కాకుండా, చర్మ సమస్యలకూ గురవుతున్నారు. చర్మంపై దద్దుర్లు, దురదతోపాటు రసాయనాలతో తయారవుతున్న శానిటరీ ప్యాడ్ల వినియోగం కారణంగా ఇరిటేషన్‌ వస్తోందని తెలిపారు.
58.9 % : ఆర్గానిక్‌ కాటన్‌ ప్యాడ్స్‌ పట్ల ఆసక్తి చూపుతున్నారు.
32.6 % : వివక్షని ఎదుర్కోవాల్సి వస్తుందనో, మరో కారణం చేతనో పీరియడ్స్‌ అన్న విషయాన్ని బయటకు చెప్పకుండా ఒక్కసారైనా దాచిపెట్టినవారు.  
... ఈ అంశాలన్నీ మహిళల్లో నెలసరి శుభ్రతపై అవగాహన ఎంతగా పెరగాల్సి ఉందన్నది సూచిస్తున్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్