ఇలా అందం పెరుగుతుంది!

ఎండ వేడికి చర్మం కమిలి పోయి, నల్లగా మారి మెరుపును కోల్పోయిందా... దుమ్మూ, ధూళీ, కాలుష్యం చర్మాన్ని నిర్జీవంగా మార్చేశాయా... అయితే  పెరుగు పూత పడాల్సిందే.

Published : 14 Apr 2022 01:40 IST


ఎండ వేడికి చర్మం కమిలి పోయి, నల్లగా మారి మెరుపును కోల్పోయిందా... దుమ్మూ, ధూళీ, కాలుష్యం చర్మాన్ని నిర్జీవంగా మార్చేశాయా... అయితే  పెరుగు పూత పడాల్సిందే.

ఓట్స్‌తో... పావు కప్పు పెరుగులో రెండు చెంచాల ఓట్స్‌ పొడి వేసి ఆ మిశ్రమాన్ని ముఖానికి పట్టించాలి. తర్వాత మర్దనా చేయాలి. పావు గంటాగి కడిగేయాలి. ఓట్స్‌ చర్మానికి క్లెన్సర్‌లా పనిచేస్తాయి. మోముపై పేరుకున్న మృత కణాలను, మురికినీ తొలగిస్తాయి.

గుడ్డుతో... గిన్నెలో చిన్న అరటి పండును బాగా మెదపాలి. దీంట్లో గుడ్డులోని తెల్లసొన, చెంచా శనగ పిండి, రెండు చెంచాల పెరుగు వేసి బాగా కలపాలి. దీన్ని ముఖం, మెడకు పట్టించాలి. ఆరాక గోరు వెచ్చని నీళ్లతో కడిగేయాలి. ఈ పూత తరచూ వేసుకుంటే మోము మృదువుగా మారుతుంది.

మెంతులతో... గిన్నెలో చెంచా పెరుగు, పెద్ద చెంచా మెంతి పొడి, అర చెంచా చొప్పున బాదం నూనె, గులాబీ నీళ్లు... వేసి కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి పూతలా వేసి వేళ్లతో మృదువుగా రుద్దాలి. పది నిమిషాలాగి చల్లటి నీళ్లతో కడిగేయాలి.

చక్కెర పొడితోనూ... అర చెంచా చొప్పున పెరుగు, చక్కెర పొడిని కలిపి ముఖానికి పట్టించాలి.

* మీది జిడ్డు చర్మమైతే పెరుగు పూతలను ఎక్కువగా వాడొద్దు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్