వ్యాయామం తర్వాత విశ్రాంతి...
మాధురి వ్యాయామం చేస్తుంది. కానీ అది అయ్యీ అవ్వగానే పనుల్లో పడిపోతుంది. ఈ పద్ధతి ఆరోగ్యానికి హానికరం అని హెచ్చరిస్తున్నారు నిపుణులు. వ్యాయామం తర్వాత కొద్దిసేపైనా విశ్రాంతి అవసరమని సూచిస్తున్నారు.
మాధురి వ్యాయామం చేస్తుంది. కానీ అది అయ్యీ అవ్వగానే పనుల్లో పడిపోతుంది. ఈ పద్ధతి ఆరోగ్యానికి హానికరం అని హెచ్చరిస్తున్నారు నిపుణులు. వ్యాయామం తర్వాత కొద్దిసేపైనా విశ్రాంతి అవసరమని సూచిస్తున్నారు.
వర్కవుట్లు ముగించిన తర్వాత కాసేపైనా విశ్రాంతి తీసుకోకపోతే శారీరక, మానసికారోగ్యంపై తీవ్ర ప్రభావం పడుతుంది. వ్యాయామ సమయంలో పెరిగే గుండె వేగాన్ని మెల్లగా అదుపులోకి తేవాలి. లేదంటే తల తిరిగినట్లు, వికారంగా అనిపిస్తుంది. కాబట్టి కొన్ని క్షణాలు ధ్యానం చేస్తే, గుండె లయ సాధారణ స్థాయికి చేరుకుంటుంది. మనసూ ప్రశాంతమవుతుంది. వ్యాయామాలు అయ్యాక పది నిమిషాలు కొన్ని తేలికైన ఆసనాలను వేస్తే కండరాల్లోని ఒత్తిడి క్రమబద్ధం అవుతుంది. మొదట మోకాళ్లపై కూర్చుని రెండు చేతులను ముందుకు చాచి అరచేతులు అలాగే తలను కూడా నేలకు ఆనేలా నిమిషం పాటు ఉంచాలి. తర్వాత మోకాళ్లను, అరచేతులను నేలకు ఆనించి తలను నేలవైపు చూస్తున్నట్లుగా మరో నిమిషముండాలి. ఇలా రెండుమూడు సార్లు చేశాక యోగముద్రలో మరో 5 నిమిషాలుండి, ఆ తర్వాత శవాసనం వేస్తే చాలు. క్రమేపీ శరీరంలోని గుండె సహా అవయవాలపై ఒత్తిడి తగ్గుముఖం పడుతుంది. యధావిధిగా రోజూవారీ కార్యక్రమాల్లో పాల్గొన్నా కూడా ఎటువంటి అనారోగ్యాలు దరిచేరవు. వ్యాయామాలతో ప్రయోజనాలనూ పొందొచ్చు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
బ్యూటీ & ఫ్యాషన్
- వేసవిలో ట్యాన్ సమస్య తగ్గాలంటే..!
- అడ్డిగ... అందాల నగ!
- ఇలా చేస్తే.. అందం తగ్గదు..!
- నాకు ఏ క్రీమ్?
- స్ట్రెచ్ మార్క్స్.. తగ్గట్లేదా..?
ఆరోగ్యమస్తు
- అందుకే వీటిని ఇలా తీసుకోవాలట..!
- వసంతంలో ఆరోగ్య జాగ్రత్తలు..!
- ప్రెగ్నెన్సీ.. ఈ జాగ్రత్తలు పాటిస్తున్నారా?
- ఉత్తేజంగా మారాలంటే..!
- రక్తహీనత తగ్గించే బీట్రూట్!
అనుబంధం
- ఒక మెట్టు దిగితే చాలు...
- ఆ అమ్మాయితో ఆ చాటింగ్.. ఆయన్ని నమ్మలేకపోతున్నా..!
- అలా చదివితే మేలే...
- చిన్నవే... చక్కదిద్దుతాయి!
- యుక్త వయసు నుంచీ...!
యూత్ కార్నర్
- పెంపుడు తల్లి వేధింపులు.. విడిచిపెట్టి వెళ్లిపోవాలనుంది..!
- అప్పుడు ఫ్యాన్... ఇప్పుడందరి ఫేవరెట్!
- భూగోళాన్ని చుట్టేస్తానంటోంది!
- దాంతో మాట్లాడుతుంటే మతి పోయిందనేవాళ్లు!
- ఎరీ... ఆ ఊరి పట్టు..!
'స్వీట్' హోం
- పుల్లటి పెరుగుతో.. పెరిగే రుచి!
- రిస్క్ లేకుండా దాచేద్దాం!
- వేసవిలో ఇల్లు చల్లగా...
- కళ్లు తిరిగే కార్పెట్లు...
- ఆ చోటు గుర్తిస్తే చాలు...
వర్క్ & లైఫ్
- మీకు ‘ట్రావెలింగ్’ అంటే ఇష్టమా..?
- పనికి ‘బ్రేక్’ వేయండి!
- ఇవి టైంపాస్ కోసమే కాదు.. సంపాదనకూ..!
- మారాలని గట్టిగా అనుకోండి!
- Samantha: చిన్న చిట్కాలతోనే 45 కిలోల బరువు తగ్గా..!