హీల్స్‌ బాధిస్తున్నాయా?

ఒరిపిడికి బొబ్బల్లా రావడం, మడమలు, నడుము నొప్పి.. హీల్స్‌ వేసుకునే వారికివన్నీ అనుభవమే. అయినా ఎత్తుగా కనిపించాలనో, స్టైల్‌ కోసమో వేస్తుంటాం. ఈసారి నుంచి.. ఈ చిన్ని జాగ్రత్తలు తీసుకోండి.

Published : 14 Apr 2022 02:26 IST

ఒరిపిడికి బొబ్బల్లా రావడం, మడమలు, నడుము నొప్పి.. హీల్స్‌ వేసుకునే వారికివన్నీ అనుభవమే. అయినా ఎత్తుగా కనిపించాలనో, స్టైల్‌ కోసమో వేస్తుంటాం. ఈసారి నుంచి.. ఈ చిన్ని జాగ్రత్తలు తీసుకోండి.
* హీల్స్‌ వేసేముందు పాదాలకు మాయిశ్చరైజర్‌ పూయండి. కందడం, బొబ్బలు ఉండవు. అందానికి కాక మీ పాదం తీరుకు తగ్గట్టుగా ఉన్నవి ఎంచుకోండి.
* చెప్పు ముందు భాగం మొనదేలి ఉన్నవాటికి ప్రాధాన్యం ఇవ్వొద్దు. అవి చూడటానికి అందంగా ఉన్నా వేళ్లని నొక్కిపెట్టేస్తాయి. నడకా ఇబ్బందీ, నొప్పి అదనం. పెన్సిల్‌ హీల్స్‌ స్టైల్‌ లుక్కుని ఇస్తాయి. నిజమే.. కానీ నడుము నొప్పినీ తెస్తాయి. కాబట్టి, చెప్పు మొత్తం ఒకే ఎత్తులో ఉన్నవాటిని ఎంచుకోండి. పొడవూ కనిపిస్తారు. పాదాలు, నడుముపై ప్రభావమూ తక్కువ.
* చెప్పు కింది భాగం మందంగా ఉన్నవే ఎంచుకోండి. మడమ దగ్గర పట్టీల్లా ఉన్నవి తీసుకుంటే పాదాలపై ప్రభావం ఎక్కువగా ఉండదు. ఏవి వేసుకున్నా.. వీలున్నప్పుడల్లా కాళ్లను బయటకు తీసి, చిన్న చిన్న స్ట్రెచ్‌లు చేస్తే మంచిది. ఇంటికొచ్చాక పాదాలకు చల్లటి నీటితో కాపడం పెట్టి, మాయిశ్చరైజర్‌తో మసాజ్‌ చేస్తే.. పాదాల అలసట, నొప్పులు త్వరగా దూరమవుతాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని