లక్షణాలున్నా... నెలసరి రాకుంటే?
నడుమునొప్పి, కాళ్లు లాగడం, పొత్తికడుపులో నొప్పి... ఈ లక్షణాలు కనిపించగానే ‘నెలసరి సమయం కదా’ అని జాగ్రత్తపడతాం. తీరా చూస్తే.... అది రాదు. లక్షణాలు మాత్రం వేధిస్తుంటాయి. ఇలా నెలసరి మనతో దోబూచులాడటానికి కారణం ఏమై ఉంటుంది?
నడుమునొప్పి, కాళ్లు లాగడం, పొత్తికడుపులో నొప్పి... ఈ లక్షణాలు కనిపించగానే ‘నెలసరి సమయం కదా’ అని జాగ్రత్తపడతాం. తీరా చూస్తే.... అది రాదు. లక్షణాలు మాత్రం వేధిస్తుంటాయి. ఇలా నెలసరి మనతో దోబూచులాడటానికి కారణం ఏమై ఉంటుంది?
నడుము నొప్పి, కాళ్లులాగడం వంటివన్నీ నెలసరికి ముందు కనిపించే లక్షణాలు. ఇవి ఉంటూ నెలసరి రాకపోవడాన్ని యాన్ఓవులేషన్ అంటారు. ఈ పరిస్థితికి అనేక కారణాలున్నా.. బరువు, ఆహారం, మెనోపాజ్, థైరాయిడ్ వంటివి కీలకమైనవి. మూడునెలలు దాటినా నెలసరులు రాకుండా... బరువు పెరుగుతూ ఉంటే డాక్టర్ సలహాతో థైరాయిడ్ పరీక్ష చేయించుకోవడం మంచిది. కుటుంబ నియంత్రణ మాత్రల వల్ల కూడా ఇలాంటి మార్పులు రావడానికి ఆస్కారం ఉంది.
విద్యార్థుల్లో పరీక్షల తాలుకూ ఒత్తిడి, ప్రేమలో విఫలమవడం... బ్రేకప్‌లు వంటివి కూడా నెలసరులు ఆగిపోవడానికి కారణం అవుతాయి. ఆశ్చర్యంగా ఉన్నా... ఇది నిజం. ఒత్తిడి పెరిగితే మనలోని కార్టిసాల్ స్థాయికూడా పెరుగుతుంది. ఇది మనలోని హార్మోన్ల సమతుల్యతని దెబ్బతీస్తుంది. ఫలితంగా నెలసరుల క్రమం మారుతుంది. అలాగే పాలిసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్ సమస్య ఉన్నా, మూత్రాశయంలో ఇన్ఫెక్షన్లు ఉన్నా ఈ ఇబ్బంది రావొచ్చు.
బరువు తగ్గడం కోసం అధిక శ్రమ ఉన్న వ్యాయామాలు... ఎక్కువ కాలం చేసేవారిలో కూడా లక్షణాలు కనిపిస్తాయి అలాగే భార్యభర్తల కలయిక సమయంలో కొన్ని భంగిమలు కూడా ఈ పరిస్థితికి కారణమవుతాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
బ్యూటీ & ఫ్యాషన్
- అడ్డిగ... అందాల నగ!
- వేసవిలో ట్యాన్ సమస్య తగ్గాలంటే..!
- ఇలా చేస్తే.. అందం తగ్గదు..!
- నాకు ఏ క్రీమ్?
- స్ట్రెచ్ మార్క్స్.. తగ్గట్లేదా..?
ఆరోగ్యమస్తు
- వసంతంలో ఆరోగ్య జాగ్రత్తలు..!
- అందుకే వీటిని ఇలా తీసుకోవాలట..!
- ప్రెగ్నెన్సీ.. ఈ జాగ్రత్తలు పాటిస్తున్నారా?
- ఉత్తేజంగా మారాలంటే..!
- రక్తహీనత తగ్గించే బీట్రూట్!
అనుబంధం
- ఒక మెట్టు దిగితే చాలు...
- ఆ అమ్మాయితో ఆ చాటింగ్.. ఆయన్ని నమ్మలేకపోతున్నా..!
- అలా చదివితే మేలే...
- చిన్నవే... చక్కదిద్దుతాయి!
- యుక్త వయసు నుంచీ...!
యూత్ కార్నర్
- అప్పుడు ఫ్యాన్... ఇప్పుడందరి ఫేవరెట్!
- భూగోళాన్ని చుట్టేస్తానంటోంది!
- దాంతో మాట్లాడుతుంటే మతి పోయిందనేవాళ్లు!
- ఎరీ... ఆ ఊరి పట్టు..!
- అందరికీ నచ్చేవి.. నాకు నచ్చవు.. ఎందుకిలా?
'స్వీట్' హోం
- రిస్క్ లేకుండా దాచేద్దాం!
- వేసవిలో ఇల్లు చల్లగా...
- పుల్లటి పెరుగుతో.. పెరిగే రుచి!
- కళ్లు తిరిగే కార్పెట్లు...
- ఆ చోటు గుర్తిస్తే చాలు...
వర్క్ & లైఫ్
- పనికి ‘బ్రేక్’ వేయండి!
- మీకు ‘ట్రావెలింగ్’ అంటే ఇష్టమా..?
- ఇవి టైంపాస్ కోసమే కాదు.. సంపాదనకూ..!
- మారాలని గట్టిగా అనుకోండి!
- Samantha: చిన్న చిట్కాలతోనే 45 కిలోల బరువు తగ్గా..!