ద్రవాహారం తీసుకుంటున్నారా?

ఆరోగ్యం, అందం, బరువు తగ్గడం.. కారణమేదైనా లిక్విడ్‌ డైట్‌, డిటాక్సింగ్‌లపై ఆధారపడుతున్నారు కొందరు. ఎండాకాలం ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోకపోతే ఆరోగ్యం దెబ్బతింటుంది మరి!

Published : 16 Apr 2022 00:23 IST

ఆరోగ్యం, అందం, బరువు తగ్గడం.. కారణమేదైనా లిక్విడ్‌ డైట్‌, డిటాక్సింగ్‌లపై ఆధారపడుతున్నారు కొందరు. ఎండాకాలం ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోకపోతే ఆరోగ్యం దెబ్బతింటుంది మరి!

* హెర్బల్‌ టీ.. నిమ్మకాయ నీళ్లు, తేనె.. పండ్లు, కూరగాయల రసాలు వంటి సహజ డిటాక్సింగ్‌ పద్ధతులతో హాని ఉండదు. వీటినీ పరిమితంగానే తీసుకోవాలి. ఇక చర్మ ఆరోగ్యానికనీ, బరువు తగ్గడానికనీ ప్రొటీన్‌ షేక్‌లు తీసుకుంటున్నారు. వీటిలో నిల్వ పదార్థాలుంటాయి. ఇవి త్వరిత ఫలితాలిచ్చినా దుష్ప్రభావాలను చూపుతాయి. ఇలాంటి వాటికి దూరంగా ఉండటమే మేలు.

* కొల్లాజెన్‌ పెంచేవనీ, బయోటిన్‌ పేరిట ఎన్నో సప్లిమెంట్లు, డ్రింక్‌లు అందుబాటులోకి వచ్చాయి. వీటిని వైద్యులు మన ఆరోగ్య పరిస్థితి, అవసరం ఇలా అన్నీ దృష్టిలో ఉంచుకొని సూచిస్తారు కాబట్టి, పర్లేదు. సొంతంగా మాత్రం ప్రయత్నించొద్దు.

* లిక్విడ్‌ డైట్‌ అంటే.. ఘన ఆహారాన్ని పూర్తిగా మానేయమని కాదు. ఇలా చేస్తే కావాల్సిన పోషకాలు అందవు. దీంతో నీరస పడటమే కాదు.. జబ్బులకూ గురవ్వొచ్చు. సాధారణంగా మూడు పూటలా ఘనాహారాన్ని తీసుకుంటాం కదా! వీటిల్లో ఒక పూట  మాత్రం ద్రవాహారాన్ని తీసుకోవాలి. ఈ సమయంలోనూ ఇమ్యూనిటీని పెంచే, శరీరానికి తక్షణ శక్తినిచ్చే పండ్ల రసాలకు ప్రాధాన్యమివ్వాలి. సి విటమిన్‌ ఉన్నవాటికి ప్రాధాన్యమిస్తే మంచిది.

* సరైన ఆహారం అందకపోతే నీరసమే కాదు, ఒత్తిడికీ దారితీస్తుంది. కాబట్టి, ఉదయం, రాత్రుళ్లు తప్పక ఘనాహారం తీసుకోవాలి. ఆకలనిపిస్తే సీజనల్‌ పండ్ల రసాలను చక్కెర లేకుండా తీసుకోవాలి. దీంతో కావాల్సిన విటమిన్లు, మినరల్స్‌ అందడంతోపాటు ఒత్తిడీ ఉండదు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్