ఫోన్‌తో అందం హుష్‌!

మచ్చల్లేని, మెరిసే చర్మం కావాలా? అయితే ఫోన్‌ పక్కన పెట్టేయండి. రెండింటికీ సంబంధమేంటని ఆశ్చర్యపోకండి. అదేపనిగా ఫోన్‌ చేతిలో ఉంటే దాని ప్రభావం చర్మంపై పడుతుందట. అధ్యయనాలు చెబుతున్నాయీ మాట.

Published : 18 Apr 2022 00:46 IST

మచ్చల్లేని, మెరిసే చర్మం కావాలా? అయితే ఫోన్‌ పక్కన పెట్టేయండి. రెండింటికీ సంబంధమేంటని ఆశ్చర్యపోకండి. అదేపనిగా ఫోన్‌ చేతిలో ఉంటే దాని ప్రభావం చర్మంపై పడుతుందట. అధ్యయనాలు చెబుతున్నాయీ మాట.

* నికెల్‌, కోబాల్ట్‌ వంటి వాటిని ఫోన్ల తయారీలో వాడతారు. వీటి నుంచి విడుదలయ్యే రేడియేషన్‌ కిరణాలు చర్మంలోని యాంటీజెన్స్‌పై ప్రభావం చూపుతాయి. దీంతో అలర్జీలకు అవకాశమెక్కువ. అలా డెర్మటైటిస్‌కు కారణమవుతుంది.
* ఎక్కువసేపు తదేకంగా స్క్రీన్‌ను చూస్తుండటంవల్ల కళ్ల పక్కన గీతలొస్తాయట. చిన్న అక్షరాలు, తక్కువ వెలుతురులో చదవడమూ దీనికి కారణమవుతాయి.
* చేత్తో పట్టుకుని ఎక్కువసేపు మెడ వంచి చూడటం వల్ల ఆ ప్రదేశంలో ముడతలు వస్తాయి. వృద్ధాప్య ఛాయలకు చిహ్నమిది. దీర్ఘకాలంలో అక్కడ కొలాజెన్‌ తగ్గి చర్మం సాగుతుంది.
* మొబైల్‌ నుంచి వచ్చే నీలికాంతి నిద్రను దూరం చేస్తుంది. ఫలితమే ఉబ్బినట్లుగా ఉండే కళ్లు. దీర్ఘకాలంలో ఈ సమస్య కళ్ల కింద నల్లటి వలయాలకు దారితీస్తుంది.
* ఫోను వాడనప్పుడు తోచిన చోట పెట్టేస్తుంటాం. దీంతో దుమ్ము, సూక్ష్మక్రిములు చేరతాయి. ఫోన్‌ మాట్లాడేప్పుడు అవి చర్మంలోకి చేరి అలర్జీలు, యాక్నేకు కారణమవుతాయి. కాబట్టి..  కాలక్షేపానికి దీనిపై ఆధారపడకండి. ఎప్పటికప్పుడు తెరను  శుభ్రం చేయాలి. మాట్లాడేప్పుడు చర్మానికి దూరంగా పెట్టాలి.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్