ఆహారంతో అధిక రక్తపోటు తగ్గుతుందా?
నాకు 43. ఎత్తు. 5.2. బరువు 75 కిలోలు. ఈ మధ్య బీపీ ఎక్కువగా ఉంటోంది. ఇదిలానే కొనసాగితే మాత్రలు వాడాల్సి రావొచ్చన్నారు వైద్యులు. మెనోపాజ్ లక్షణాలూ కనిపిస్తున్నాయి.
నాకు 43. ఎత్తు. 5.2. బరువు 75 కిలోలు. ఈ మధ్య బీపీ ఎక్కువగా ఉంటోంది. ఇదిలానే కొనసాగితే మాత్రలు వాడాల్సి రావొచ్చన్నారు వైద్యులు. మెనోపాజ్ లక్షణాలూ కనిపిస్తున్నాయి. ఇలాంటప్పుడు బీపీ నియంత్రణలో ఉండాలంటే ఆహారంలో ఎలాంటి మార్పులు చేసుకోవాలి?
- రేణు, హైదరాబాద్
అధిక బరువు, కుటుంబ చరిత్ర, మూత్రపిండాల్లో సమస్యలు, ఒత్తిడి, శారీరక శ్రమ లేకపోవడం... ఇవన్నీ బీపీ పెరగడానికి కారణాలే. ఎక్కువగా ఉంటే వైద్యుల సూచనలతో మందులు వాడాలి. బీపీ నియంత్రణలో లేకపోతే బ్రెయిన్ స్ట్రోక్, కిడ్నీలు పాడవడంతోపాటు కళ్లూ దెబ్బతింటాయి. డాష్ డైట్ ఆహార పద్ధతి బీపీని నియంత్రించే ఆహార విధానంగా నిరూపితమైంది. దీని ప్రకారం రోజులో ఒక వ్యక్తికి చెంచా(5 గ్రా.) ఉప్పు చాలు.
డాష్ డైట్ అంటే... కేవలం ఉప్పు తగ్గించడమే కాకుండా మేలు చేసే ఖనిజలవణాలున్న ఆహార పదార్థాలు తీసుకోవడంపై కూడా దృష్టి పెట్టడమే ఈ డైట్ ఉద్దేశం. రక్తపోటును నియంత్రించే పొటాషియం, క్యాల్షియం, మెగ్నీషియం ఉండే పదార్థాలను ఆహారంలో చేర్చుకోవాలి. ఒమేగా-3 ఫ్యాటీ, ఫోలిక్ ఆమ్లాలు రక్తాన్ని పలుచగా చేసి రక్తపోటును తగ్గిస్తాయి. రక్తంలో కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరాయిడ్ నిల్వలు తగ్గినప్పుడు రక్తప్రసరణ మెరుగవుతుంది. దాంతో బీపీ తగ్గుతుంది. కాబట్టి బరువును నియంత్రించుకోవాలి. పొట్టుతో ఉన్న గింజల రూపంలో తీసుకుంటే బీపీ తగ్గుతుంది. మాంసాహారాన్ని మితంగా తీసుకోవచ్చు.
ఎలా తగ్గించుకోవాలి? శారీరక శ్రమ తప్పనిసరి. యోగా, ధ్యానంతోపాటు ఏదైనా అభిరుచిని అలవాటు చేసుకుంటే ఒత్తిడి తగ్గుతుంది. తరచూ బరువూ, బీపీని చెక్ చేసుకోవాలి. ఊరగాయలు, అప్పడాలు, ప్రాసెస్డ్ ఫుడ్ తినొద్దు. బదులుగా రోజులో కాయగూరలు (300 గ్రా.), ఆకుకూరలు (100 గ్రా.), పండ్లు (200 గ్రా.), పాలు, పాల ఉత్పత్తులు (300 గ్రా.), పొట్టుతో ఉన్న గింజ, తృణధాన్యాలు (240 గ్రా.) తీసుకోవాలి.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.