పోషకాలతోనే ఎదుగుదల
సి విటమిన్.. వర్ణ మయమైన బెల్‌పెప్పర్స్, కాలీఫ్లవర్, బ్రొకోలీ వంటి తాజా కూరగాయలు, నారింజ, బత్తాయి, పైనాపిల్, జామ, స్ట్రాబెర్రీ, బొప్పాయిని రోజూ ఆహారంలో ఉండేలా చూడాలి. వీటిలో
సి విటమిన్.. వర్ణ మయమైన బెల్‌పెప్పర్స్, కాలీఫ్లవర్, బ్రొకోలీ వంటి తాజా కూరగాయలు, నారింజ, బత్తాయి, పైనాపిల్, జామ, స్ట్రాబెర్రీ, బొప్పాయిని రోజూ ఆహారంలో ఉండేలా చూడాలి. వీటిలో పుష్కలంగా ఉండే విటమిన్-సి పిల్లల్లో వ్యాధినిరోధక శక్తిని ఇనుమడింప చేస్తుంది. వారి జ్ఞాపకశక్తిని పెంచుతుంది. ఐరన్ లోపాన్ని సరిచేస్తుంది. పండ్లలోని పీచు జీర్ణశక్తిని మెరుగుపరుస్తుంది.
విటమిన్ ఈ.. ఇందులోని యాంటీ ఆక్సిడెంట్స్ నరాల వ్యవస్థను బలోపేతం చేస్తుంది. కణ విభజనలో ప్రధానపాత్రను ఈ విటమిన్ ఎక్కువగా తీసుకుంటుంది. వెజిటబుల్ ఆయిల్స్, గింజధాన్యాలు, విత్తనాలు, ఆకుకూరలతోపాటు ఆకుపచ్చగా ఉండే కూరగాయలన్నింటినీ పిల్లల ఆహారంలో భాగం చేయాలి. వీటిలోని విటమిన్ ఈ వ్యాధినిరోధక శక్తిని పెంచుతుంది. విటమిన్ కే2 ఎముకలకు క్యాల్షియం అందేలా చేస్తుంది. పులియబెట్టిన పెరుగు వంటి ఆహారంతోపాటు గుడ్డు, మాంసాహారం ద్వారా కే2 విటమిన్ పిల్లల ఎముకలను బలోపేతం చేస్తుంది.
సెలెనియం.. ఖనిజలవణాల్లో ఒకటైన సెలెనియం యాంటీ ఆక్సిడెంట్‌గా పనిచేస్తుంది. బీన్స్, చిక్కుడు, పుట్టగొడుగులు, పొద్దుతిరుగుడు విత్తనాల్లో ఉండే సెలెనియం చిన్నారులకు అందిస్తే చాలు. అమినో యాసిడ్ ఉండే పాల ఉత్పత్తులు, గుడ్లు, మాంసాహారం, గింజలు వంటివి పిల్లల ఎదుగుదలకు తోడ్పడతాయి.
జింక్, ఐరన్... కండరాలు బలోపేతంగా ఉండాలంటే జింక్, ఐరన్ ఉండే ఆహారాలను అందించాలి. ముదురాకుపచ్చ ఆకుకూరలు, కూరగాయలతో పాటు గుమ్మడి విత్తనాలు, గుడ్డు, మాంసాహారం ద్వారా జీవక్రియలను సక్రమంగా జరిగేలా చేయొచ్చు. బాల్యం నుంచి పోషకవిలువలున్న ఆహారం అందితేనే పిల్లల ఎదుగుదల బాగా జరుగుతుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
బ్యూటీ & ఫ్యాషన్
- వేసవిలో ట్యాన్ సమస్య తగ్గాలంటే..!
- ఇలా చేస్తే.. అందం తగ్గదు..!
- నాకు ఏ క్రీమ్?
- స్ట్రెచ్ మార్క్స్.. తగ్గట్లేదా..?
- గోటితోనే పోదు మరి!
ఆరోగ్యమస్తు
- అందుకే వీటిని ఇలా తీసుకోవాలట..!
- ప్రెగ్నెన్సీ.. ఈ జాగ్రత్తలు పాటిస్తున్నారా?
- ఉత్తేజంగా మారాలంటే..!
- రక్తహీనత తగ్గించే బీట్రూట్!
- మీ స్కోరెంత?
అనుబంధం
- ఆ అమ్మాయితో ఆ చాటింగ్.. ఆయన్ని నమ్మలేకపోతున్నా..!
- అలా చదివితే మేలే...
- చిన్నవే... చక్కదిద్దుతాయి!
- యుక్త వయసు నుంచీ...!
- పాప వల్ల నాతో ఆ సంతోషం ఉండట్లేదంటున్నారు..!
యూత్ కార్నర్
- భూగోళాన్ని చుట్టేస్తానంటోంది!
- దాంతో మాట్లాడుతుంటే మతి పోయిందనేవాళ్లు!
- ఎరీ... ఆ ఊరి పట్టు..!
- అందరికీ నచ్చేవి.. నాకు నచ్చవు.. ఎందుకిలా?
- తెల్లజుట్టు... కారణమేంటి?
'స్వీట్' హోం
- పుల్లటి పెరుగుతో.. పెరిగే రుచి!
- కళ్లు తిరిగే కార్పెట్లు...
- ఆ చోటు గుర్తిస్తే చాలు...
- చిన్నారుల చిత్రకళా ప్రదర్శన..!
- అద్దమూ మెరవాలిగా..!
వర్క్ & లైఫ్
- మీకు ‘ట్రావెలింగ్’ అంటే ఇష్టమా..?
- ఇవి టైంపాస్ కోసమే కాదు.. సంపాదనకూ..!
- మారాలని గట్టిగా అనుకోండి!
- Samantha: చిన్న చిట్కాలతోనే 45 కిలోల బరువు తగ్గా..!
- ఆఫీసులో ఇలా చేస్తున్నారా?