దానికి ఎంతైనా ఖర్చుపెడతా!

అందంగా కనిపించడానికి మేకప్‌ అవసరమే... కానీ అసలైన చర్మ సౌందర్యాన్ని కాపాడుకోవడం అంతకన్నా అవసరం అంటోంది కేజీఎఫ్‌ భామ శ్రీనిధిశెట్టి. గతంలో మిస్‌ సూపర్నేషనల్‌ టైటిల్‌ని గెల్చుకున్న ఈ అమ్మడు తాను పాటించే చిట్కాల్ని చెప్పుకొచ్చిందిలా...

Updated : 23 Apr 2022 06:42 IST

అందంగా కనిపించడానికి మేకప్‌ అవసరమే... కానీ అసలైన చర్మ సౌందర్యాన్ని కాపాడుకోవడం అంతకన్నా అవసరం అంటోంది కేజీఎఫ్‌ భామ శ్రీనిధిశెట్టి. గతంలో మిస్‌ సూపర్నేషనల్‌ టైటిల్‌ని గెల్చుకున్న ఈ అమ్మడు తాను పాటించే చిట్కాల్ని చెప్పుకొచ్చిందిలా...

మోడల్‌గా పేరుతెచ్చుకోవాలన్నది నా కల. బెంగళూరులో ఓ ఫ్యాషన్‌వీక్‌లో పాల్గొనడానికి వెళ్తే బరువు ఎక్కువగా ఉన్నానని వద్దన్నారు. ఇక నా కలకి గుడ్‌బై చెప్పేద్దామనుకున్నా. రాత్రంతా ఏడ్చాక ‘ఆ తిరస్కారాన్ని ఛాలెంజ్‌గా’ తీసుకోవాలనిపించింది. జిమ్‌కెళ్లి వర్క్‌వుట్లు మొదలుపెట్టా. రోజూ 65 కేజీల బరువు ఎత్తేదాన్ని. ఆ తర్వాత ఐటీ కంపెనీలో ఉద్యోగం. జిమ్‌, ఆఫీస్‌ అయ్యాక... అడుగు కూడా వేయలేనంత నీరసం ఆవహించేది. అయినా నాకు నేను ఉత్సాహం తెచ్చుకుంటూ.. మాటిమాటికీ నా కలను గుర్తుచేసుకుంటూ మిస్‌ సూపర్నేషనల్‌ టైటిల్‌ని గెల్చుకున్నా! ఆ సమయంలో విపరీతమైన మేకప్‌ వేసేవారు. అప్పుడే చర్మాన్ని కాపాడుకోవాల్సిన అవసరం గురించి తెలిసింది. వృత్తిరీత్యా మేకప్‌ వేసుకున్నా చర్మం సహజ సౌందర్యాన్ని కాపాడుకోవాలిగా. ఇందుకోసం ఖరీదైన మాయిశ్చరైజర్లూ, ప్రైమర్‌పై ఎక్కువ ఖర్చు చేసేదాన్ని. వీటి వల్ల మేకప్‌ ప్రభావం చర్మంపై తక్కువ పడేది. రోజ్‌, అలొవెరాలతో చేసే మిస్ట్‌ అంటే నాకు చాలా ఇష్టం. మేకప్‌కి ముందూ, తర్వాత ఇది చేసే మాయాజాలం అద్భుతం. ఇక ఎండ వేడి నుంచి కాపాడుకోవడానికి విటమిన్‌ సి సీరమ్‌నీ, సన్‌స్క్రీన్‌నీ రోజువారీ చర్మ రక్షణలో భాగం చేసుకున్నా. నిద్రపోయే ముందు కచ్చితంగా టోనర్‌తో మేకప్‌ని తొలగిస్తా. మంచినీళ్లు, మంచి నిద్ర ఈ రెండింటి విషయంలో రాజీపడను.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్