పరుగులెత్తక్కర్లే... అడుగులేసినా చాలు!

వ్యాయామం చేస్తున్నారా? అంటే మనలో చాలామంది సమాధానం... ‘ఇంటి పని, వంట పని, ఆఫీసు... ఇక టైమెక్కడ?’ అని. కానీ ఏకబిగిన కాకపోయినా రోజులో వీలున్నప్పుడల్లా కొంత సమయం కేటాయించినా, కొన్ని అడుగులు నడిచినా చాలంటున్నారు నిపుణులు.

Published : 24 Apr 2022 00:13 IST

వ్యాయామం చేస్తున్నారా? అంటే మనలో చాలామంది సమాధానం... ‘ఇంటి పని, వంట పని, ఆఫీసు... ఇక టైమెక్కడ?’ అని. కానీ ఏకబిగిన కాకపోయినా రోజులో వీలున్నప్పుడల్లా కొంత సమయం కేటాయించినా, కొన్ని అడుగులు నడిచినా చాలంటున్నారు నిపుణులు.

వారంలో కనీసం 150 నిమిషాలకు తక్కువ కాకుండా రోజూ అరగంట వ్యాయామానికి కేటాయించాలంటున్నారు నిపుణులు. ఈ నియమం పాటిస్తే పక్షవాతం, గుండె పోటు, టైప్‌-2 డయాబెటిస్‌లతోపాటు కొన్ని రకాల క్యాన్సర్‌ల నుంచీ దూరంగా ఉండొచ్చని అధ్యయనాలు చెబుతున్నాయి. బరువులెత్తడం, పరుగు లాంటి కఠిన వ్యాయామాలకు సమయం లేదనుకుంటే కాస్త మధ్యమస్థాయివి చేసినా మేలేనట. అంటే శ్వాస తీసుకునే, గుండె కొట్టుకునే రేటుని పెంచేవన్నమాట.

* వ్యాయామం కోసం నడుస్తున్నారనుకుంటే అది రన్నింగ్‌లా కాకుండా, మెల్లగానూ కాకుండా మధ్యస్థంగా ఉండాలన్నమాట.

* రోజులో 10-15 సార్లు రెండుమూడు నిమిషాల చొప్పున వ్యాయామం చేసినా మంచిదేనన్నది నిపుణుల మాట. ఇలా విడిగా చేసినా, ఒకేసారి 30 నిమిషాలు చేసినా ఫలితాలు ఒకేలా ఉంటాయట. 2-3 నిమిషాలు వేగంగా నడవడం, మెట్లు ఎక్కడం, షాపింగ్‌ చేసినపుడు సంచులు మోయడం... ఇవన్నీ వ్యాయామానికి చక్కటి ప్రత్యామ్నాయాలంటున్నారు.

* 30 నిమిషాల వ్యాయామానికి బదులు.. 60 ఏళ్లలోపు వారు రోజుకి 8-10 వేల అడుగులు, 60 దాటిన వాళ్లు 6-8 వేల అడుగులు నడిచినా సమానమైన ప్రయోజనాలుంటాయట. కాబట్టి వ్యాయామానికి సమయం లేదనే మాట మర్చిపోయి, వీటిలో ఏదోక మార్గాన్ని ఎంచుకోండి.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్