మెనోపాజ్‌తో చర్మానికీ సమస్యే

నెలసరి నిలుస్తున్న సమయంలో చర్మం పలురకాలుగా ప్రభావితమవుతుంది. ఈస్ట్రోజన్‌ హార్మోన్‌ తగ్గడంతో ఈ మార్పులు చోటు చేసుకుంటాయంటున్నారు నిపుణులు. దీనివల్ల కలిగే పరిణామాల గురించి, అలాగే తీసుకోవాల్సిన ముందస్తు జాగ్రత్తల గురించి ఇలా వివరిస్తున్నారు.

Updated : 26 Apr 2022 06:18 IST

నెలసరి నిలుస్తున్న సమయంలో చర్మం పలురకాలుగా ప్రభావితమవుతుంది. ఈస్ట్రోజన్‌ హార్మోన్‌ తగ్గడంతో ఈ మార్పులు చోటు చేసుకుంటాయంటున్నారు నిపుణులు. దీనివల్ల కలిగే పరిణామాల గురించి, అలాగే తీసుకోవాల్సిన ముందస్తు జాగ్రత్తల గురించి ఇలా వివరిస్తున్నారు.

కొల్లాజెన్‌ ఉత్పత్తికి కారణమయ్యే ఈస్ట్రోజన్‌ తగ్గడంతో చర్మంలో పలు శాశ్వత మార్పులు మొదలవుతాయి. ముఖ చర్మం సాగే గుణాన్ని కోల్పోతుంది. చర్మం కింద కొవ్వు తగ్గుతుంది. దీంతో ముఖమంతా పొడిబారి, ముడతలు, గీతలు ఏర్పడతాయి. ఈ సమస్యను పూర్తిగా నివారించలేకపోయినా ముందస్తుగా తీసుకునే కొన్ని జాగ్రత్తలు ఈ ప్రభావానికి త్వరగా చేరుకోకుండా చూస్తాయి. కొందరిలో 40లోకి అడుగుపెడుతున్నప్పుడే మెనోపాజ్‌ లక్షణాలు మొదలవుతాయి. వీరి చర్మం త్వరగా ప్రభావితమయ్యే ప్రమాదం ఉంది. అందుకే 40 దాటిన వెంటనే ఈస్ట్రోజన్‌ స్థాయులను వైద్య పరీక్షల ద్వారా తెలుసుకోగలగాలి. దీనికి తగినట్లుగా ఎసెన్షియల్‌ ఆయిల్స్‌ మర్దన, సబ్బు వంటి వాటిని కాకుండా డీహైడ్రేషన్‌కు దూరంగా ఉంచే క్లెన్సర్‌ వినియోగించాలి. సెరామైడ్స్‌, షియా బటర్‌, ఫ్యాటీ యాసిడ్స్‌, గ్లిసరిన్‌ వంటి వాటితో తయారుచేసే మాయిశ్చరైజర్లు
వాడటం మంచిది.   

రెటినాల్‌తో..

30 ఏళ్లు నిండినప్పటి నుంచి కొంచెం కొంచెంగా చర్మంలో కొల్లాజెన్‌ తగ్గడం మొదలవుతుంది. మెనోపాజ్‌ స్థాయికి వచ్చే సరికి దీని ఉత్పత్తి పూర్తిగా తగ్గిపోతుంది. దీంతో ముఖచర్మంలో మార్పులు కొట్టొచ్చినట్లు కనిపిస్తాయి. దీన్నుంచి దూరంగా ఉండాలంటే ముఖానికి సీరం అప్లై చేయడం మంచి ఫలితాన్నిస్తుంది. చర్మాన్ని మృదువుగానూ మారుస్తుంది. సి విటమిన్‌ ఉండే సీరం లేదా దీనికి బదులుగా సప్లిమెంట్‌ తీసుకున్నా ప్రయోజనమే.  చర్మాన్ని మరికొన్ని రోజుల పాటు మృదువుగా ఉంచడానికి ఇది ప్రయత్నిస్తుంది. అలాగే ఈస్ట్రోజన్‌ తగ్గుతున్నప్పుడు హార్మోన్లలో చోటు చేసుకున్న మార్పులు చర్మంపై మచ్చలకు కారణమవుతాయి. ఈ సమయంలో చర్మకణాలను ఆరోగ్యంగా ఉంచే రెటినాల్‌ను ఉపయోగిస్తే ఇది చర్మరంధ్రాలను శుభ్రపరిచి మురికిని చేరనివ్వదు. దీంతో మొటిమల సమస్య నుంచి బయటపడొచ్చు. అదే సమయంలో చర్మంపై ఏర్పడే గీతలకూ దూరంగా ఉండొచ్చు. దీంతోపాటు సన్‌స్క్రీన్‌తోపాటు యాంటీ ఆక్సిడెంట్స్‌ ఉన్న ఉత్పత్తులు చర్మాన్ని పొడిబారనివ్వవు. మెనోపాజ్‌ ప్రభావం చర్మంపై త్వరగా పడకుండానూ.. పరిరక్షిస్తాయి.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్