Updated : 28/04/2022 06:23 IST

మౌనంతోనూ దృఢత్వం

చదువుకునే రోజుల్లో దాదాపుగా అమ్మాయిలంతా ఆరోగ్యంగా ఉంటారు. కానీ పెళ్లి, ఉద్యోగ బాధ్యతలు చేపట్టాక కొందరు బక్కచిక్కిపోతుంటారు. ఇంకొందరికి ఊబకాయం వచ్చేస్తుంటుంది. ఆరోగ్యంగా, ఉల్లాసంగా ఉండటం ఏమంత జటిలమైన సంగతి కాదు. కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే నడి వయసులోనూ, ఆపైనా కూడా చక్కటి ఆరోగ్యంతో రెట్టించిన ఉత్సాహంతో ఉండొచ్చు.

*  డైటింగ్‌ పేరుతో తిండి తగ్గించేస్తే లావు తగ్గుతారు సరే... దాంతో పాటు ఆరోగ్యమూ చురుకుదనమూ కూడా తగ్గిపోయి నిస్సత్తువ ఆవరిస్తుంది. ఇక చురుగ్గా, చలాకీగా ఉండేదెలా? నిజానికి కడుపు మాడ్చుకోవడం డైటింగ్‌ కానే కాదు. ఏం తినాలో, ఎంత తినాలో డైటీషియన్‌ సలహా మేరకు తీసుకోవడం ఉత్తమం.
* పెళ్లయ్యాక బాధ్యతలు మీద పడ్డా మనల్ని మనం నిర్లక్ష్యం చేయడానికి లేదు. పనులన్నీ చక్కబెట్టుకుంటూనే దృఢంగా ఉండేందుకు ప్రయత్నించాలి. ఉదయం అల్పాహారం చేయడానికి వీలవకపోతే బ్రెడ్డు, కార్న్‌ ఫ్లేక్స్‌ లాంటివైనా తప్పక తినాలని.. లేదంటే అల్సరు, ఎసిడిటీ లాంటి అనారోగ్యాలు వచ్చిపడతాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు. తినేటప్పుడు ఆర్థిక ఇబ్బందులు, బంధుమిత్రుల మీద ఫిర్యాదులు లాంటివి వద్దు. సరదా విషయాలు ముచ్చటించుకోండి. తిన్నది చక్కగా వంటబడుతుంది.
రోజూ ఓ గంట ధ్యానం చేస్తే మంచిది. లేదంటే అవకాశం ఉన్నప్పుడల్లా మౌనాన్ని అలవాటు చేసుకోండి. సంభాషణ వల్ల శక్తి కరగడమే కాదు ఆ ఆలోచనలతో మనసులో అలజడి కలుగుతుంది. మౌనం శక్తియుక్తులను పెంచి ప్రశాంతతను ఇస్తుంది.
ఓ వెయింగ్‌ మిషన్‌ కొంటే ఇంటిల్లిపాదికీ పనికొస్తుంది. వారానికోసారి తప్పనిసరిగా బరువు చూసుకోండి. మీ వయసు, ఎత్తులను బట్టి ఎంత బరువుండాలో చూడండి. దాన్ని బట్టి తక్కువ బరువుంటే పెరిగేందుకు, ఎక్కువుంటే తగ్గేందుకు ప్రయత్నించండి.
కోపతాపాలు మానసిక ప్రశాంతతనే కాదు, శారీరక ఆరోగ్యాన్నీ దెబ్బతీస్తాయి. కనుక ఆవేశాలూ ఆక్రోశాలకు దూరంగా ఉండండి. అదే మీ ఆరోగ్యానికి శ్రీరామరక్ష.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని