జుట్టు ఎక్కువగా ఊడుతోందా...

జుట్టు ఊడటానికి రకరకాల కారణాలుంటాయి. అయితే కొన్ని పనులకు దూరంగా ఉంటే ఈ రాలడం కొద్దిగా అదుపులో ఉంటుంది. లేదంటే మరింతగా ఊడిపోతుంది. కాబట్టి చేయకూడని పనులేంటంటే... హెయిర్‌ ట్రీట్‌మెంట్స్‌ వద్దు... జుట్టు సమస్యలున్నప్పుడు కురులను మృదువుగా చేయించుకోవడం, హెయిర్‌ రీబాండింగ్‌ లాంటి రకరకాల కేశ చికిత్సలకు వెళ్లొద్దు.

Published : 02 May 2022 00:29 IST

జుట్టు ఊడటానికి రకరకాల కారణాలుంటాయి. అయితే కొన్ని పనులకు దూరంగా ఉంటే ఈ రాలడం కొద్దిగా అదుపులో ఉంటుంది. లేదంటే మరింతగా ఊడిపోతుంది. కాబట్టి చేయకూడని పనులేంటంటే...

హెయిర్‌ ట్రీట్‌మెంట్స్‌ వద్దు...
జుట్టు సమస్యలున్నప్పుడు కురులను మృదువుగా చేయించుకోవడం, హెయిర్‌ రీబాండింగ్‌ లాంటి రకరకాల కేశ చికిత్సలకు వెళ్లొద్దు.

బ్లీచ్‌ వద్దు... జుట్టు బాగా ఊడుతోంటే రంగు వేయడం ఆపేయండి. సాధారణంగా జుట్టుకు రకరకాల రంగులు వేయడానికి ముందు బ్లీచింగ్‌ ప్రక్రియ ఉంటుంది. ఎంత లేతరంగు వేయాలంటే హైడ్రోజన్‌ పెరాక్సైడ్‌ అనే రసాయనాన్ని అంత ఎక్కువగా వాడాల్సి ఉంటుంది. దీనివల్ల జుట్టు సహజ తేమను కోల్పోయి ఇతర సమస్యలు ఎదురవుతాయి. పొడిబారడం, చిట్లడం వంటివి జరుగుతాయి.

జుట్టు పూతలు... వారానికి ఒకట్రెండు చాలు.. సాధారణంగా వెంట్రుకలు పాడవుతున్నాయంటే చాలామంది రకరకాల పూతలు వేసుకోవడానికి సిద్ధమవుతారు. ఈ పూతలు జుట్టుకు ప్రొటీన్లు, తేమను అందిస్తాయి. అంతమాత్రాన వీటిని రోజూ వేసుకోవాలని లేదు. ఇలా చేస్తే జుట్టు తెగిపోతుంది. కేశాలు ఆరోగ్యంగా ఉండటానికి తరచూ కొబ్బరి లేదా ఆలివ్‌నూనెతో మర్దనా చేసుకుంటే చాలు. కలబంద పూత కూడా వేసుకోవచ్చు.

రసాయన మిళిత షాంపూలు వద్దు... ముందు నుంచే మీ జుట్టు పాడై ఉంటే ఎస్‌ఎల్‌ఎస్‌ (సోడియం లారైల్‌ సల్ఫేట్‌) ఫ్రీ షాంపూ వాడితే సరిపోతుంది. ఇది జుట్టును కాపాడుతుంది. ఒకవేళ మీది జిడ్డుచర్మం అయితే ఎస్‌ఎల్‌ఎస్‌ ఉండే షాంపూను వాడితే సరి. ఇవే కాకుండా వెంట్రుకలు తడిగా ఉన్నప్పుడు దువ్వొద్దు, హీటింగ్‌ టూల్‌్్స లాంటివి వాడొద్దు. ఇవి కేశాలను మరింత పాడు చేస్తాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్