చిరంజీవ!
వ్యాధినిరోధక శక్తి... వ్యాక్సినేషన్లు... ఇలాంటి మాటలు వినబడటం మొదలుపెట్టిన తర్వాతే ఆరోగ్యభాగ్యం విలువేంటో మనకు అర్థమవుతోంది కదూ! ‘ఇప్పుడు మన ఆరోగ్యానికేమయ్యింది? అంతా బాగానే ఉంది కదా!’ అని అనుకోకుండా కాస్త ఈ విషయాలపైనా దృష్టి సారించండి..
వ్యాధినిరోధక శక్తి... వ్యాక్సినేషన్లు... ఇలాంటి మాటలు వినబడటం మొదలుపెట్టిన తర్వాతే ఆరోగ్యభాగ్యం విలువేంటో మనకు అర్థమవుతోంది కదూ! ‘ఇప్పుడు మన ఆరోగ్యానికేమయ్యింది? అంతా బాగానే ఉంది కదా!’ అని అనుకోకుండా కాస్త ఈ విషయాలపైనా దృష్టి సారించండి..
కాలిపగుళ్లతో జాగ్రత్త: నీళ్లలో ఎక్కువ పని చేస్తాం కాబట్టి కాలిపగుళ్లు సహజం... అని చేతికందిన క్రీం ఏదో ఒకటి రాసుకుంటారు చాలామంది మహిళలు. కానీ ఆ పగుళ్లకు డయాబెటిస్ కూడా కారణం కావచ్చు. ఆస్ట్రేలియాలో జరిగిన అధ్యయనం... కాలి అల్సర్లు మహిళల జీవిత కాలాన్ని గణనీయంగా తగ్గిస్తున్నాయని తేల్చింది.
పదిశాతం తగ్గి చూడండి: ‘నేనేమీ అంత లావుగా ఉండను’ అనే నిర్లక్ష్యధోరణి నెమ్మదిగా జీవిత కాలాన్ని హరించి వేస్తుందని, వృద్ధాప్య సమస్యల్ని రెండు రెట్లు ఎక్కువగా చుట్టు ముట్టేలా చేస్తుందని అంటున్నాయి అధ్యయనాలు. అన్నాల్స్ ఆఫ్ ఇంటర్నేషనల్ మెడిసిన్ సంస్థ సుదీర్ఘ కాలం చేసిన అధ్యయనాల్లో ఈ విషయం తెలిసింది. అదే.. అధిక బరువులో పదిశాతం తగ్గడానికి ప్రయత్నించినా షుగర్ వంటి సమస్యలని అదుపులో ఉంచవచ్చట.
పంటికి ఇంటి వైద్యం వద్దు: చాలా మంది పంటినొప్పి, చిగుళ్లవాపు వంటి సమస్యలకి ఏవో ఇంటి వైద్యాలు చేసి సరి పుచ్చుకుంటారు. కానీ చాపకింద నీరులా గుండె సమస్యలు పెరిగి పోతున్నాయని గ్రహించలేరు. అవును.. నోటిలోని బ్యాక్టీరియా గుండె జబ్బులకు కారణమవుతుంది. కనీసం ఆరునెలల కోసారైనా దంతవైద్యుడిని సంప్రదిస్తే మేలు.
తాజా గాలిని పీల్చేయండి: 35 ఏళ్ల వయసు దాటిన దగ్గర్నుంచీ ఊపిరితిత్తుల సాగే సామర్థ్యం తగ్గుతూ వస్తుంది. దీనికి తోడు కూర్చునే తీరు, జీవనశైలి కూడా తగినంత ఆక్సిజన్ అందకుండా అడ్డుకుంటాయి. దీన్ని దృష్టిలో పెట్టుకుని రోజులో ఓ పది నిమిషాలు నిటారుగా కూర్చుని గాలి పీల్చుకోండి. మెదడుకి తగినంత ఆక్సిజన్ అందితే ఒత్తిడి తగ్గి జీవితకాలం పెరుగుతుంది.
అవసరం ఉంటేనే: కొంతమంది అవసరం ఉన్నా లేకపోయినా మందులను విపరీతంగా వాడతారు. ముఖ్యంగా పాత మందుల చీటీనే కొనసాగిస్తూ ఉంటారు. ఈ సారి జనరల్ ఫిజీషియన్ని కలిసేటప్పుడు మీరు రోజూ వేసుకుంటున్న మందుల్ని చూపించి అందులో అవసరం లేని వాటిని తక్షణమే ఆపేయండి. ఎందుకంటే మందులు కిడ్నీలపై ప్రభావం చూపిస్తున్నాయి. అల్సర్లు రావడానికి కారణం అవుతాయి. ఇవీ మన జీవిత కాలంపై ప్రభావం చూపిస్తాయని గుర్తుపెట్టుకోండి. అలాగే చాలామంది బీపీ, షుగర్ వంటి వాటి లక్షణాలు కనిపిస్తున్నా డాక్టర్ దగ్గరకు వెళ్లడానికి వెనకాడతారు. లేదా ఒక సారి ఇచ్చిన మందులనే జీవితాంతం వాడుతుంటారు. ఇదీ మంచి పద్ధతి కాదు.
చూపు మందగిస్తే: చక్కని కంటి చూపునకు... జీవితకాలానికీ సంబంధం ఉందంటోంది అమెరికన్ మెడికల్ అసోసియేషన్ జర్నల్లోని ఓ వ్యాసం. చాలా మంది వయసు పెరుగుతున్న కొద్దీ వచ్చే కంటి సమస్యల్ని నిర్లక్ష్యం చేస్తుంటారు. అలాంటి వారిలో జీవిత కాలం ఆరేళ్లు తగ్గిపోయే అవకాశం ఉందని తాజా అధ్యయనాలు చెబుతున్నాయి.
ఇవేకాదు... ఎముకలు గుల్ల బారడం, సైనస్, న్యుమోనియా, ఆస్తమా, హార్మోన్ సమస్యలని ఎప్పటికప్పుడు గమనించుకుంటూ ఉంటేనే జీవిత కాలాన్నీ పొడిగించు కోగలుగుతాం. మనం ఆరోగ్యంగా ఉంటేనే కదా మన కుటుంబాన్నీ ఆరోగ్యంగా ఉంచగలుగుతాం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
బ్యూటీ & ఫ్యాషన్
- అడ్డిగ... అందాల నగ!
- వేసవిలో ట్యాన్ సమస్య తగ్గాలంటే..!
- ఇలా చేస్తే.. అందం తగ్గదు..!
- నాకు ఏ క్రీమ్?
- స్ట్రెచ్ మార్క్స్.. తగ్గట్లేదా..?
ఆరోగ్యమస్తు
- వసంతంలో ఆరోగ్య జాగ్రత్తలు..!
- అందుకే వీటిని ఇలా తీసుకోవాలట..!
- ప్రెగ్నెన్సీ.. ఈ జాగ్రత్తలు పాటిస్తున్నారా?
- ఉత్తేజంగా మారాలంటే..!
- రక్తహీనత తగ్గించే బీట్రూట్!
అనుబంధం
- ఒక మెట్టు దిగితే చాలు...
- ఆ అమ్మాయితో ఆ చాటింగ్.. ఆయన్ని నమ్మలేకపోతున్నా..!
- అలా చదివితే మేలే...
- చిన్నవే... చక్కదిద్దుతాయి!
- యుక్త వయసు నుంచీ...!
యూత్ కార్నర్
- అప్పుడు ఫ్యాన్... ఇప్పుడందరి ఫేవరెట్!
- భూగోళాన్ని చుట్టేస్తానంటోంది!
- దాంతో మాట్లాడుతుంటే మతి పోయిందనేవాళ్లు!
- ఎరీ... ఆ ఊరి పట్టు..!
- అందరికీ నచ్చేవి.. నాకు నచ్చవు.. ఎందుకిలా?
'స్వీట్' హోం
- రిస్క్ లేకుండా దాచేద్దాం!
- వేసవిలో ఇల్లు చల్లగా...
- పుల్లటి పెరుగుతో.. పెరిగే రుచి!
- కళ్లు తిరిగే కార్పెట్లు...
- ఆ చోటు గుర్తిస్తే చాలు...
వర్క్ & లైఫ్
- పనికి ‘బ్రేక్’ వేయండి!
- మీకు ‘ట్రావెలింగ్’ అంటే ఇష్టమా..?
- ఇవి టైంపాస్ కోసమే కాదు.. సంపాదనకూ..!
- మారాలని గట్టిగా అనుకోండి!
- Samantha: చిన్న చిట్కాలతోనే 45 కిలోల బరువు తగ్గా..!