కసరత్తుల తర్వాత ఏం తినాలి?
ఆరోగ్యం కోసం వ్యాయామం తప్పనిసరి. మరి ఎక్సర్సైజ్ చేశాక తినొచ్చా లేదా? ఎంత సేపు ఆగాలి? ఇలా చాలా అనుమానాలుంటాయి. కొంతమంది డైటింగ్ అనీ కసరత్తుల తర్వాత తినరు. అది సమస్యను ఇంకా పెద్దది చేయగలదు. కాబట్టి...
ఆరోగ్యం కోసం వ్యాయామం తప్పనిసరి. మరి ఎక్సర్సైజ్ చేశాక తినొచ్చా లేదా? ఎంత సేపు ఆగాలి? ఇలా చాలా అనుమానాలుంటాయి. కొంతమంది డైటింగ్ అనీ కసరత్తుల తర్వాత తినరు. అది సమస్యను ఇంకా పెద్దది చేయగలదు. కాబట్టి...
* శరీరానికి గ్లైకోజన్ ఇంధనం లాంటిది. వ్యాయామం సమయంలో ఇది ఖర్చైపోతుంది. దీన్ని వృద్ధి చేసుకోవాలన్నా, ఎముకల్లోని ప్రొటీన్‌ను పెంపొందించుకోవాలన్నా దేహానికి తగినన్ని పోషకాలు కావాలి. అది కూడా వ్యాయామం ముగిసిన 45 నిమిషాల్లోపే. అలా తినేటప్పుడు ‘ప్రొటీన్, కార్బోహైడ్రేట్లు, ఫ్యాట్’ ఉండేలా చూసుకోవాలి.
* ప్రొటీన్ అమైనో ఆసిడ్లను అందించి, శరీరం పుంజుకునేలా చేస్తుంది. ఇందుకు కనీసం 20-40 గ్రా. ప్రొటీన్ అవసరం. ఇది గుడ్లు, పెరుగు, చీజ్, చికెన్, ప్రొటీన్ బార్, ట్యూనా చేపల్లో పుష్కలంగా ఉంటుంది.
* కార్బోహైడ్రేట్లు కోల్పోయిన గ్లైకోజన్‌ను తిరిగి పొందేలా చేస్తాయి. ప్రొటీన్లతో పోలిస్తే ఇది మూడు రెట్లు అధికంగా అవసరం. కనీసం 60-120 గ్రా. కావాలి. ఇవి పాలు, చిలగడ దుంప, క్వినోవా, ఓట్స్, బంగాళా దుంప, గోధుమ బ్రెడ్ వంటి వాటిల్లో ఎక్కువ.
* వ్యాయామం చేసేదే కొవ్వు తగ్గించుకోవడానికైతే మళ్లీ దాన్నే తినమంటారేంటి అనుకోకండి. జీవక్రియలకు కొవ్వు చాలా అవసరం. తక్కువ మోతాదులో అయినా తప్పక తీసుకోవాలి. శరీరానికి శక్తిని అందించడంలో దీనిది ప్రధాన పాత్ర. మంచి కొవ్వును ఇచ్చే అవకాడో, నట్స్, గుమ్మడి, పొద్దు తిరుగుడు విత్తనాలను తీసుకుంటే సరిపోతుంది.
* వ్యాయామంలో ఎలక్ట్రోలైట్లు చెమట రూపంలో బయటకు వెళ్లిపోతాయి. కాబట్టి, నీటినీ ఎక్కువగా తాగాలి. పండ్ల రసాలు, గ్లూకోజ్ నీళ్లు వంటివీ సాయపడతాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
బ్యూటీ & ఫ్యాషన్
- అడ్డిగ... అందాల నగ!
- వేసవిలో ట్యాన్ సమస్య తగ్గాలంటే..!
- ఇలా చేస్తే.. అందం తగ్గదు..!
- నాకు ఏ క్రీమ్?
- స్ట్రెచ్ మార్క్స్.. తగ్గట్లేదా..?
ఆరోగ్యమస్తు
- వసంతంలో ఆరోగ్య జాగ్రత్తలు..!
- అందుకే వీటిని ఇలా తీసుకోవాలట..!
- ప్రెగ్నెన్సీ.. ఈ జాగ్రత్తలు పాటిస్తున్నారా?
- ఉత్తేజంగా మారాలంటే..!
- రక్తహీనత తగ్గించే బీట్రూట్!
అనుబంధం
- ఒక మెట్టు దిగితే చాలు...
- ఆ అమ్మాయితో ఆ చాటింగ్.. ఆయన్ని నమ్మలేకపోతున్నా..!
- అలా చదివితే మేలే...
- చిన్నవే... చక్కదిద్దుతాయి!
- యుక్త వయసు నుంచీ...!
యూత్ కార్నర్
- అప్పుడు ఫ్యాన్... ఇప్పుడందరి ఫేవరెట్!
- భూగోళాన్ని చుట్టేస్తానంటోంది!
- దాంతో మాట్లాడుతుంటే మతి పోయిందనేవాళ్లు!
- ఎరీ... ఆ ఊరి పట్టు..!
- అందరికీ నచ్చేవి.. నాకు నచ్చవు.. ఎందుకిలా?
'స్వీట్' హోం
- రిస్క్ లేకుండా దాచేద్దాం!
- వేసవిలో ఇల్లు చల్లగా...
- పుల్లటి పెరుగుతో.. పెరిగే రుచి!
- కళ్లు తిరిగే కార్పెట్లు...
- ఆ చోటు గుర్తిస్తే చాలు...
వర్క్ & లైఫ్
- పనికి ‘బ్రేక్’ వేయండి!
- మీకు ‘ట్రావెలింగ్’ అంటే ఇష్టమా..?
- ఇవి టైంపాస్ కోసమే కాదు.. సంపాదనకూ..!
- మారాలని గట్టిగా అనుకోండి!
- Samantha: చిన్న చిట్కాలతోనే 45 కిలోల బరువు తగ్గా..!