ఈ పానీయాలతో చలవ...

మండే ఎండల్లో శరీరం డీహైడ్రేట్‌ కాకుండా తాజాగా, ఆరోగ్యంగా ఉండాలంటే ఈ పానీయాలను ప్రయత్నించండి...

Updated : 04 May 2022 05:16 IST

మండే ఎండల్లో శరీరం డీహైడ్రేట్‌ కాకుండా తాజాగా, ఆరోగ్యంగా ఉండాలంటే ఈ పానీయాలను ప్రయత్నించండి..

పుచ్చ, నిమ్మ.. ఈ రెండూ శరీరానికి కావాల్సిన నీటిని అందించి తేమగా ఉంచుతాయి. నిమ్మలో విటమిన్‌ సితోపాటు యాంటీ ఆక్సిడెంట్లు మెండుగా ఉంటాయి. ఇవి జీర్ణక్రియ సాఫీగా సాగేలా చూస్తాయి. పుచ్చలోని అమైనో ఆమ్లాలు బరువును నియంత్రిస్తాయి. ఈ రెంటిని కలిపి తీసుకుంటే మంచిది. రుచి కోసం చక్కెర/ తేనెలను చేర్చుకోవచ్చు.

కొబ్బరి, రోజ్‌ మిల్క్‌షేక్‌.. కొబ్బరి నీళ్లు బరువును నియంత్రిస్తాయి. వీటిని తీసుకుంటే శరీరం డీహైడ్రేట్‌ అవ్వదు. కెలొరీలు, కొవ్వులు తగ్గుతాయి. గులాబీ నీళ్లలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలం. ఇవి బరువు నియంత్రణలో, జీర్ణ క్రియలో బాగా పని చేస్తాయి. కొబ్బరి నీళ్లు, చక్కెర, చల్లటి పాలు కలిపి చిక్కటి, చల్లటి మిల్క్‌షేక్‌ చేసేయండి మరి. 

గ్రీన్‌ టీ.. జీవక్రియా రేటును మెరుగుపరుస్తుంది. యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండే ఈ టీని తీసుకుంటే శరీరానికి చల్లదనం అందుతుంది. అంతేకాదు.. అతినీలలోహిత కిరణాల నుంచి రక్షిస్తుంది కూడా. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్