నోటికి నోనో నేర్పండి!

కొందరికి ఎప్పుడూ ఏదో ఒకటి తింటూనే ఉండటం అలవాటు. అయితే ఇది ఆరోగ్యానికి మంచిది కాదు. మరి దీన్ని ఎలా నియంత్రించుకోవాలి?

Updated : 06 May 2022 05:51 IST

కొందరికి ఎప్పుడూ ఏదో ఒకటి తింటూనే ఉండటం అలవాటు. అయితే ఇది ఆరోగ్యానికి మంచిది కాదు. మరి దీన్ని ఎలా నియంత్రించుకోవాలి?

* మీరు ఉద్యోగిని అయితే ఆఫీసు కప్‌ బోర్డుల్లో ఉండే కుకీస్‌, బిస్కట్లు, స్వీట్లు... అన్నింటినీ తీసేసి ఖాళీగా ఉంచండి.

* ఎదురుగా తినుబండారాలు కనిపించినప్పుడు వాటి వైపు నుంచి దృష్టి మరల్చుకునేందుకు అక్కడి నుంచి వెళ్లిపోండి. లేదా మరో పని మీదకు దృష్టి మళ్లించండి. తీపి తినాలపించినప్పుడల్లా క్యారెట్‌, యాపిల్‌, కీరా లాంటివి తీసుకోవడం మొదలుపెట్టండి. కొన్నాళ్లకు అలవాటైపోతుంది. 

* సమయానికి, సరైన మోతాదులో పోషకహారాన్ని తీసుకోవాలని నియమం పెట్టుకుని దాన్ని తు.చ. తప్పకుండా ఆచరించాలి. 

* ఆరోగ్యాన్నిచ్చే పదార్థాలనే తింటా....  అంటూ తాజా కాయగూరలు, ఆకుకూరలు, పండ్లు, తృణధాన్యాలు, పొట్టుతో ఉండే పప్పుదినుసులను ఆహారంలో నిత్యం తీసుకోండి. ఏదైనా వేడుకో, పండగప్పుడో నచ్చిన స్వీట్‌/ చాక్లెట్‌/ ఐస్‌క్రీమ్‌ లాంటివి అదీ తక్కువ మోతాదులో తినండి.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్