అవిసె గింజలు తింటున్నారా?

అవిసెగింజలు మహిళల ఆరోగ్యానికి చాలా మంచివి. ఇలా చెబితే చాలు.. కొంతమంది ఓ పద్ధతంటూ లేకుండా తినేస్తుంటారు. శరీరానికి మేలు చేసే ఆహారమే అయినా... తినాల్సిన పద్ధతిలోనే తినాలి! చాలామంది అవిసెగింజలు తినేటప్పుడు చేసే ఈ పొరపాట్లు మీరు చేయొద్దు..

Updated : 06 May 2022 05:51 IST

అవిసెగింజలు మహిళల ఆరోగ్యానికి చాలా మంచివి. ఇలా చెబితే చాలు.. కొంతమంది ఓ పద్ధతంటూ లేకుండా తినేస్తుంటారు. శరీరానికి మేలు చేసే ఆహారమే అయినా... తినాల్సిన పద్ధతిలోనే తినాలి! చాలామంది అవిసెగింజలు తినేటప్పుడు చేసే ఈ పొరపాట్లు మీరు చేయొద్దు..

అవిసె గింజల్లో ఏ శాకాహారంలోనూ లేనంత ఎక్కువగా లిగ్‌నాన్స్‌ ఉంటాయి. మహిళలకు అవసరమైన ఈస్ట్రోజన్‌, యాంటీ ఆక్సిడెంట్లు కలిపి ఉన్న ఆహారం ఇది. ఈ గింజల్లోని ఒమెగా-త్రీ ఆమ్లాలకి రొమ్ముక్యాన్సర్‌, ప్రొస్టేట్‌ క్యాన్సర్‌ వంటి వాటిని నియంత్రించే గుణం ఉందని తాజా అధ్యయనాలు చెబుతున్నాయి.

మెనోపాజ్‌ సమయంలో, ఆ తర్వాత శరీరం నుంచి ఆవిర్లు వెలువడుతుంటాయి. ఈ సమస్య అదుపులోకి రావాలంటే రోజూ చెంచా గింజలు తింటే ఫలితం ఉంటుంది.

అవిసెగింజల్లో ఒమెగా-3, పీచు పుష్కలంగా ఉండటం వల్ల గుండెకు మేలు జరుగుతుంది. అలాగని వీటిని ఎక్కువ తినకూడదు అంటున్నారు నిపుణులు. ముఖ్యంగా అలర్జీలు, థైరాయిడ్‌... గ్యాస్‌ సమస్యలున్నవారు, గర్భిణులు, బాలింతలు అవిసె గింజలకు దూరంగా ఉండటమే మంచిది. వీటిల్లోని సైనోజెన్‌ అని హానికారక రసాయనం థైరాయిడ్‌ సమస్యని మరింత పెంచుతుంది. అయొడిన్‌ లోపానికి కారణం అవుతుంది.

మోతాదు మేరకే తినాలి. రోజూ తీసుకోవాలనుకొనే వాళ్లు... అర టీస్పూన్‌ గింజలతో మొదలు పెట్టాలి. ఏ అలర్జీలూ రావడం లేదనుకుంటే అప్పుడు చెంచా వరకూ తినొచ్చు. అది కూడా ఒకేసారి కాదు. ఉదయం, సాయంత్రం. రోజులో రెండు చెంచాలు మించి తినకూడదు. వేసవిలో.. ఇంకా తగ్గించి తినాలి.

వీటిని పచ్చిగా తినడం కన్నా... డ్రైరోస్ట్‌ చేసి, పొడిచేసుకుని తినడం మేలు. వేడి చేసినప్పుడు దీనిలోని హానికారక ఫైటిక్‌ యాసిడ్‌ నశించిపోతుంది. మొలకెత్తించి తిన్నా కూడా మంచిదే. ఈ గింజలు నీళ్లలో వేసినప్పుడు కొద్దిగా ఉబ్బి, జెల్లీలా అవడం గమనించే ఉంటారు. దానర్థం నీళ్లను ఎక్కువగా గ్రహిస్తాయని. అందుకే చెంచా తిన్నా, అరచెంచా తిన్నా తర్వాత నీళ్లు ఎక్కువ తాగాలి. లేదంటే మలబద్ధకానికి దారి తీయొచ్చు. ఈ జాగ్రత్తలు తీసుకుంటే అవిసెగింజల ప్రయోజనాల్ని సంపూర్ణంగా అందుకోవచ్చు. వీటిని పొడి రూపంలో తినాలనుకుంటే తప్పనిసరిగా ఫ్రిజ్‌లో దాచిపెట్టాల్సిందే. లేదంటే పోషకాలు వేగంగా నశిస్తాయి.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్