ప్రయాణాల్లో.. చర్మం జాగ్రత్త!
వేసవిలో పిల్లలకు సెలవులనో...చల్లదనం కోసమో ప్రయాణాలు కట్టేస్తుంటాం. కావాల్సినవన్నీ జాగ్రత్తగా సర్దేసుకుంటాం. చర్మసంరక్షణ జాగ్రత్తలకీ చోటిచ్చారా మరి? చాలాసార్లు వెళ్లేది మనవాళ్ల ఇంటికేగా అని క్రీములు వగైరా తీసుకెళ్లం. వేరే ప్రాంతాలకు వెళితే హోటళ్లలో ఇస్తారనో, అక్కడే ఏదో ఒకటి కొనుక్కోవచ్చనుకుంటాం. కొత్త చేయడం అన్న మాట విన్నారా? అది...
వేసవిలో పిల్లలకు సెలవులనో...చల్లదనం కోసమో ప్రయాణాలు కట్టేస్తుంటాం. కావాల్సినవన్నీ జాగ్రత్తగా సర్దేసుకుంటాం. చర్మసంరక్షణ జాగ్రత్తలకీ చోటిచ్చారా మరి?
* చాలాసార్లు వెళ్లేది మనవాళ్ల ఇంటికేగా అని క్రీములు వగైరా తీసుకెళ్లం. వేరే ప్రాంతాలకు వెళితే హోటళ్లలో ఇస్తారనో, అక్కడే ఏదో ఒకటి కొనుక్కోవచ్చనుకుంటాం. కొత్త చేయడం అన్న మాట విన్నారా? అది చర్మానికీ వర్తిస్తుంది. కాబట్టి, మీరు తరచుగా వాడే ఉత్పత్తులను తప్పక వెంట తీసుకెళ్లండి. చాలాకాలం పనికొస్తాయని పెద్దవి తెచ్చిపెట్టుకుంటుంటాం. వాటిని తీసుకెళ్లడం ఇబ్బంది అనిపిస్తే... ఆ నాలుగు రోజులకూ సరిపోయేలా చిన్నవి కొనుక్కోండి. మర్చిపోయినా సమస్య ఉండదు.
* ప్రయాణాల్లో అసౌకర్యమని నీరు తక్కువగా తాగడం వంటివీ చేయకండి. డీహైడ్రేషన్ శరీరంపైనే కాదు చర్మంపైనా ప్రభావం చూపగలదు. నీరు, పండ్ల రసాలను ఎక్కువగా తీసుకోండి. ముఖానికి ఎక్కువ తేమనిచ్చే మాయిశ్చరైజర్, సన్‌స్క్రీన్ తప్పక రాస్తే.. చర్మం తేమ కోల్పోదు.
* ప్రాంతాన్ని బట్టి వాతావరణంలో మార్పు ఉంటుంది. అధిక వేడి లేదా చలి, తేమ, కాలుష్యం.. ఏదైనా ప్రభావం పడేది చర్మంపైనే. కాబట్టి, చిన్న మార్పుకే కంగారొద్దు.
* లేదూ.. విటమిన్ సి, హాల్యురోనిక్ ఆసిడ్, ఆక్టివేటెడ్ సి, సాల్సిలిక్ ఆసిడ్ వంటివి ఉన్న ఉత్పత్తులను వెంట తీసుకెళ్లండి. చర్మంపై పొక్కులు, గరుకుగా మారడం, జీవం కోల్పోవడం వంటి సమస్యలను దరిచేరనివ్వవు. పైగా మచ్చలు, చర్మరంగులో తేడాలు రావడం వంటివీ దూరం చేస్తాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
బ్యూటీ & ఫ్యాషన్
- వార్థక్యపు ఛాయలు లేకుండా..!
- హెయిర్ బన్.. స్టైలిష్‌గా వేసేద్దాం!
- సన్‌స్క్రీన్... పౌడర్‌లో!
- వేసవిలో వీటి విషయంలో జాగ్రత్త!
- వ్యాయామం వల్ల మొటిమలు రాకుండా..!
ఆరోగ్యమస్తు
- నిద్ర లేకపోయినా.. నీరసించిపోకుండా!
- రాగుల్లో దాగున్న ‘ఆరోగ్యం’!
- వేరుశనక్కాయలు తింటే... ధ్యానం చేసినట్లే!
- తేలిగ్గా తీసుకోవద్దు!
- ప్రసవానంతరం పొట్టను ఇలా తగ్గించుకుందాం!
అనుబంధం
- అనుమానంతో.. నా ఫోన్ హ్యాక్ చేశాడా?
- పోనీ ఇలా చెప్పి చూద్దామా?
- పెళ్లికి ముందు సరేనన్నాడు.. ఇప్పుడు వద్దంటున్నాడు!
- నో చెప్పండిలా!
- అనుమానిస్తున్నాడని నిరూపించేదెలా?
యూత్ కార్నర్
- Miss Universe : ఈ ముద్దుగుమ్మదే.. ఆ ఘనత!
- ఆ చక్రాలని నడిపించేది వాళ్లే!
- దాచగలరు..!
- మన గచ్చకాయలాట... కొరియాలో!
- విరాళాలకు వారధిగా.. ఆమె సేవలు!
'స్వీట్' హోం
- వేసవిలో.. పండ్లు, కూరలు పాడవకుండా..!
- వేసవిలో.. ఇల్లు చల్లగా!
- గోవర్ధనాల గుబాళింపు!
- ఇనుప కడాయిలో ఇవొద్దు!
- Green Vegetables : వీటిని ఎలా వండుతున్నారు?
వర్క్ & లైఫ్
- ఒక్క రోజులోనే.. ఒంటరిగా.. ఆ ప్రాంతాలన్నీ చుట్టేశా!
- ఆ అల్లరి పిల్లే ఇప్పుడు టీచరైంది.. ఈ స్టూడెంట్-టీచర్ కథ చదివారా?!
- ప్రయాణాలకు... చిన్ని సాయాలు!
- ఆర్థికంగా ఎదగాలంటే...
- ఇది మహిళల హోలీ.. మగాళ్లకు నో ఎంట్రీ!