తలనొప్పిని తగ్గించేస్తుంది...

ఎండల తీవ్రత గురించి ‘దుస్తులు వేస్తే తడుస్తున్నాయి, తీస్తే ఎండుతున్నాయి’ అంటూ చతురోక్తి విసిరారెవరో! నిజమే మరి.. సూర్యుడు నిప్పులు కురిపిస్తున్నట్లే ఉన్నాడు. ఆ వేడికి తలనొప్పి, కళ్లమంట లాంటి అనారోగ్యాలు కలుగుతున్నాయి.

Updated : 21 May 2022 06:35 IST

ఎండల తీవ్రత గురించి ‘దుస్తులు వేస్తే తడుస్తున్నాయి, తీస్తే ఎండుతున్నాయి’ అంటూ చతురోక్తి విసిరారెవరో! నిజమే మరి.. సూర్యుడు నిప్పులు కురిపిస్తున్నట్లే ఉన్నాడు. ఆ వేడికి తలనొప్పి, కళ్లమంట లాంటి అనారోగ్యాలు కలుగుతున్నాయి. బయటికెళ్తే ఎక్కడ వడదెబ్బ తగులుతుందోనని భయమేస్తోంది కదూ! కానీ ఈ సమస్యలను యోగాతో నివారించవచ్చు. శీతలీ ప్రాణాయామం, భైరవీ ముద్రల మాదిరిగానే దంత ప్రాణాయామం వేసవి తాపాన్ని తగ్గిస్తుంది.

శీతలీ ప్రాణాయామంలో నాలుక సున్నాలాగా చుట్టి దాని మధ్యలోంచి గాలిని తీసుకోవాలి కదా! అలా చేయడం కొందరికి రాదు. అలా రానివాళ్ల కోసమే ఇది. స్వచ్ఛమైన గాలి తగిలే స్థలంలో సౌకర్యవంతంగా వెన్నెముక వంచకుండా నిటారుగా కూర్చోవాలి. పై పళ్లూ కింది పళ్లూ తాకేలా బిగించి ఉంచి, ఆ పళ్ల సందుల్లోంచి శ్వాస తీసుకుని ముక్కుతో వదలాలి. ఐదారు నిమిషాలు ఇలా చేస్తే వేసవిలో ఎదుర్కొనే తలనొప్పి, కళ్ల మంట, తల తిరుగుడు, తినాలనిపించకపోవడం లాంటి సమస్యలు తగ్గుతాయి. రక్తపోటు అదుపులో ఉంటుంది. మానసిక ఒత్తిడి, ఆందోళన దరికి చేరవు. శరీరాన్ని చల్లబరచడంలో ఇదెంతగానో తోడ్పడుతుంది. ఈ కాలంలో తప్పక చేయాల్సిన ప్రాణాయామం ఇది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్