గర్భిణులకు ఏబీసీ జ్యూస్‌..

విమలకు ఆరోనెల వచ్చింది. ఆకలి తీరేలా ఆహారం తీసుకుంటుంది. పోషకాలకూ పెద్దపీట వేస్తుంది. అయినా అప్పుడప్పుడు నీరసించి పోతుంటుంది. ఇలాకాకుండా ఉండాలన్నా తక్షణ శక్తినివ్వాలన్నా ఏబీసీ జ్యూస్‌ సరైనది అంటున్నారు నిపుణులు. ఇది శక్తినే కాదు, శరీరంలోని మలినాలను బయటకు పంపి ఆరోగ్యాన్ని, సౌందర్యాన్నీ పెంపొందిస్తుందని సూచిస్తున్నారు.

Updated : 21 May 2022 06:35 IST

విమలకు ఆరోనెల వచ్చింది. ఆకలి తీరేలా ఆహారం తీసుకుంటుంది. పోషకాలకూ పెద్దపీట వేస్తుంది. అయినా అప్పుడప్పుడు నీరసించి పోతుంటుంది. ఇలాకాకుండా ఉండాలన్నా తక్షణ శక్తినివ్వాలన్నా ఏబీసీ జ్యూస్‌ సరైనది అంటున్నారు నిపుణులు. ఇది శక్తినే కాదు, శరీరంలోని మలినాలను బయటకు పంపి ఆరోగ్యాన్ని, సౌందర్యాన్నీ పెంపొందిస్తుందని సూచిస్తున్నారు.

డీటాక్సినింగ్‌ డ్రింక్‌ అని పిలిచే ఈ జ్యూస్‌ తయారీకి... ముందుగా రెండు యాపిల్స్‌, క్యారెట్లు, ఒక బీట్‌రూట్‌ తీసుకుని చిన్న ముక్కలుగా తరిగి మిక్సీలో వేసుకోవాలి. మెత్తగా అయిన ఈ మిశ్రమానికి ఒక కాయ నారింజ రసం, అరచెక్క నిమ్మరసం, అర చెంచా అల్లం రసం, చెంచా మిరియాలపొడి వేసి మరోసారి మిక్సీపట్టాలి. ఇలా తయారైన ఏబీసీ జ్యూస్‌ను ఒక గ్లాసులోకి తీసుకొని నాలుగు ఐస్‌క్యూబ్స్‌ వేసి తీసుకుంటే చాలు.

ప్రయోజనాలు..

పోషకాలగనిగా చెప్పే ఈ జ్యూస్‌లో ఏ, బీ, సీ, ఈ, కే విటమిన్లు, ఫోలేట్‌, నియాసిన్‌, జింక్‌, కాపర్‌, పొటాషియం, మాంగనీస్‌, ఫాస్పరస్‌, ఐరన్‌, మెగ్నీషియంతో పాటు యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరంలోని మలినాలను బయటకు పంపి వ్యాధినిరోధక శక్తిని పెంచుతాయి. ఈ జ్యూస్‌ గర్భిణులకు సరైన పోషకాలను సమయానికి అందిస్తుంది. గర్భస్థ శిశువు ఎదుగుదల ఆరోగ్యంగా ఉండేలా పరిరక్షిస్తుంది. చర్మం కూడా ఆరోగ్యంగా మారుతుంది. ఇందులోని పీచు జీర్ణాశయాన్ని ఆరోగ్యంగా ఉండేలా చేసి, అధిక బరువు సమస్య రాకుండా నివారిస్తుంది. కొలెస్ట్రాల్‌ స్థాయులను తగ్గిస్తుంది. రక్తపోటును అదుపు చేస్తుంది. ఒక గ్లాసు జ్యూస్‌ తీసుకుంటే చాలు, శరీరానికి కావాల్సిన కెలొరీలను అందిస్తుంది. వయసు పైబడే ఛాయలను త్వరగా దరికి రానీయదు. శిరోజాలు రాలే సమస్యను పోగొట్టి ఒత్తైన జుట్టు పెరిగేలా చేస్తుంది. నేత్ర సంబంధిత సమస్యలకూ దూరంగా ఉండొచ్చు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్