ఇష్టంగా తిందాం, ఆరోగ్యంగా ఉందాం..

పని ఒత్తిడి, మానసిక ఆందోళన, తినడానికి సమయం లేకపోవడం, తన మీద తనకు ధ్యాస లేకపోవడం.. లాంటి కారణాలతో స్త్రీలు సరైన ఆహారం తీసుకోక అనారోగ్యాల బారిన పడుతున్నట్టు అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. కుటుంబ సభ్యులందరికీ ఆలంబనగా నిలిచే ఇల్లాలు తన గురించి తాను పట్టించుకోకపోతే ఎలా? అందుకే ఆరోగ్యకరమైన ఆహారం మీద శ్రద్ధపెడదాం.

Published : 27 May 2022 00:40 IST

పని ఒత్తిడి, మానసిక ఆందోళన, తినడానికి సమయం లేకపోవడం, తన మీద తనకు ధ్యాస లేకపోవడం.. లాంటి కారణాలతో స్త్రీలు సరైన ఆహారం తీసుకోక అనారోగ్యాల బారిన పడుతున్నట్టు అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. కుటుంబ సభ్యులందరికీ ఆలంబనగా నిలిచే ఇల్లాలు తన గురించి తాను పట్టించుకోకపోతే ఎలా? అందుకే ఆరోగ్యకరమైన ఆహారం మీద శ్రద్ధపెడదాం.

వాల్‌నట్స్‌లో యాంటీ ఆక్సిడెంట్స్, ఒమేగా3 ఆమ్లాలూ ఉన్నందున అవి గుండెకి మంచిది. రోజుకు రెండు తింటే రక్తపోటు అదుపులో ఉంటుంది. బ్రెస్ట్‌ క్యాన్సరు, ట్యూమర్లను నిరోధిస్తాయివి. హృద్రోగాలు వచ్చే అవకాశం తక్కువ. 55 దాటిన మహిళల్లో అధిక రక్తపోటు బారిన పడుతున్న వారి శాతం ఎక్కువగానే ఉంది. ఆహారంలో తగినంత ఉల్లి, వెల్లుల్లి ఉంటే ఆ సమస్యను అరికడతాయి.

జామ, ఉసిరి, కమలా, నారింజ, బొప్పాయి, నిమ్మ మొదలైనవాటిల్లో సి-విటమిన్‌ అధికం. వీటి వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది.

ఆలివ్‌ నూనె మంచి కొలెస్ట్రాల్‌ను పెంపొందిస్తుంది. ఇక యాపిల్‌ గురించి చెప్పాల్సిందేముంది! ఏడాదంతా దొరికే ఈ పండును రోజుకొకటి తినగలిగితే చాలా మంచిది. నాణ్యమైన డార్క్‌ చాక్లెట్‌ తింటే శరీరానికి శక్తి చేకూరుతుంది. 

పప్పుల్లో మాంసకృత్తులుంటాయని తెలిసిందే. కంది, పెసర, మినప, శనగ, అలసంద, సోయా, బఠాణీ, వేరుశనగ.. తదితర గింజలను చారెడు నానబెట్టి, ఉడికించి తింటే చాలు అవసరమైన పోషకాలన్నీ అందుతాయి. వీటిని మార్చి మార్చి తింటే జిహ్వకు కూడా వేరే వేరే రుచులను అందించినట్లవుతుంది. కేవలం ఆకలి తీరేలా తింటే సరిపోదు. ముఖ్యంగా వరి అన్నంలో చెప్పుకోదగ్గ పోషకాలేమీ ఉండవు. శరీరానికీ, మెదడుకీ కూడా బలమైన ఆహారం కావాలి. పప్పు ధాన్యాలు తినడం వల్ల జ్ఞాపకశక్తి కూడా మెరుగవుతుందని అల్జీమర్స్‌ మీద జరిపిన పరిశోధనల్లో తేలింది. పురుషులతో పోలిస్తే స్త్రీలు దీర్ఘకాలం జీవిస్తున్నట్లు జనాభా లెక్కలు తెలియజేస్తున్నాయి. మరి వృద్ధాప్యంలో మతిమరపు బారిన పడితే ఎంత కష్టం కదూ! కనుక ఆహారం మీద తప్పకుండా ధ్యాస పెట్టండి. తిండిని నిర్లక్ష్యం చేసి జబ్బులను కొనితెచ్చుకునే కంటే రుచిగా చేసుకుని తింటే ఆనందం, ఆరోగ్యం కూడా. 

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్