ఇవీ ఒత్తిడి కారకాలే!
వేళకి తింటున్నా అలసిపోవడం, చిన్న చిన్న విషయాలకీ ఆందోళన.. ప్రతి చిన్నదానికీ ఒత్తిడిగా అనిపించడం.. వీటన్నింటికీ పని, పరిస్థితులే అన్నిసార్లూ కారణం కాకపోవచ్చు అంటున్నారు నిపుణులు. కొన్ని రకాల ఆహార పదార్థాలు కారణమవొచ్చు. కాబట్టి, వాటికి దూరంగా ఉండమంటున్నారు. అవేంటంటే..
వేళకి తింటున్నా అలసిపోవడం, చిన్న చిన్న విషయాలకీ ఆందోళన.. ప్రతి చిన్నదానికీ ఒత్తిడిగా అనిపించడం.. వీటన్నింటికీ పని, పరిస్థితులే అన్నిసార్లూ కారణం కాకపోవచ్చు అంటున్నారు నిపుణులు. కొన్ని రకాల ఆహార పదార్థాలు కారణమవొచ్చు. కాబట్టి, వాటికి దూరంగా ఉండమంటున్నారు. అవేంటంటే..
ప్రాసెస్డ్ ఫుడ్.. బేకరీ పదార్థాలు, సోడాల్లో చక్కెరలు ఎక్కువ. కొన్నిసార్లు అధిక మొత్తంలో ఫ్రక్టోజ్ ఉండే కార్న్ సిరప్నీ వాడుతుంటారు. ఇవి మెదడుకు కావాల్సిన దానికన్నా ఎక్కువ శాతంలో గ్లూకోజ్‌ను సరఫరా చేస్తాయి. దీంతో ఇన్ఫ్లమేషన్, తద్వారా ఒత్తిడి, అలసటకు కారణమవుతాయి. బదులుగా తాజా పండ్లు, కూరగాయలకు ప్రాధాన్యమివ్వాలి.
* ప్రాసెస్డ్ ఆయిల్స్.. బాగా శుద్ధి చేసిన నూనెలని వాడుతుంటాం. వీటిల్లో ఒమెగా 3 ఫ్యాటీ ఆసిడ్లు తగ్గి, ఒమెగా 6 ఫ్యాటీ ఆసిడ్లు అధిక మొత్తంలో చేరతాయి. ఇవి కుంగుబాటుకు కారణమవొచ్చట. బదులుగా గానుగ నూనెల్ని వాడటం మంచిది.
* చక్కెరలు.. స్వీట్లు, కేకులే కాదు.. కెచప్, సలాడ్ డ్రెసింగ్స్ వంటి వాటిల్లోనూ ఉంటాయి. దీంతో శరీరానికి కావాల్సిన దానికంటే ఎక్కువ మొత్తంలో చేరతాయి. ఫలితమే ఆందోళన, భావోద్వేగాల్లో మార్పులు. కాబట్టి, ఏది కొన్నా దానిలో యాడెడ్ షుగర్స్ ఉన్నాయేమో చెక్ చేసుకోవడం మంచిది. తీపి తినాలపిస్తే ఎండు ఫలాలు, డార్క్ చాక్లెట్ వంటివి తీసుకోవడం మేలు.
* వేపుళ్లు.. బయటికి వెళ్లామంటే చిప్స్, సమోసా, ఫ్రైడ్ చికెన్.. నోరూరించే పదార్థాలెన్నో! కానీ బాగా వేయించడం, ఆ నూనెనే పలుమార్లు ఉపయోగిస్తుండటంతో చెడు కొవ్వు శరీరంలోకి చేరుతుంది. ఇది ఒత్తిడి, భావోద్వేగాల్లో మార్పులకు కారణమవుతుంది. ఒక్కోసారి గుండెజబ్బులకీ దారితీయొచ్చు. కాబట్టి, వీటికి దూరంగా ఉండటం మేలు.
* కృత్రిమ చక్కెరలు.. డైట్ కారణంగానో, మధుమేహమనో చక్కెరకు దూరంగా ఉండేవారే ఎక్కువ. ప్రత్యామ్నాయంగా కృత్రిమ చక్కెరలను వాడుతుంటారు. కానీ ఇవి ఒత్తిడిని కలిగిస్తాయట. మెదడు ఆరోగ్యానికీ హానికరం. తేనెను వాడుకోవడం మేలు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
బ్యూటీ & ఫ్యాషన్
- అడ్డిగ... అందాల నగ!
- వేసవిలో ట్యాన్ సమస్య తగ్గాలంటే..!
- ఇలా చేస్తే.. అందం తగ్గదు..!
- నాకు ఏ క్రీమ్?
- స్ట్రెచ్ మార్క్స్.. తగ్గట్లేదా..?
ఆరోగ్యమస్తు
- వసంతంలో ఆరోగ్య జాగ్రత్తలు..!
- అందుకే వీటిని ఇలా తీసుకోవాలట..!
- ప్రెగ్నెన్సీ.. ఈ జాగ్రత్తలు పాటిస్తున్నారా?
- ఉత్తేజంగా మారాలంటే..!
- రక్తహీనత తగ్గించే బీట్రూట్!
అనుబంధం
- ఒక మెట్టు దిగితే చాలు...
- ఆ అమ్మాయితో ఆ చాటింగ్.. ఆయన్ని నమ్మలేకపోతున్నా..!
- అలా చదివితే మేలే...
- చిన్నవే... చక్కదిద్దుతాయి!
- యుక్త వయసు నుంచీ...!
యూత్ కార్నర్
- అప్పుడు ఫ్యాన్... ఇప్పుడందరి ఫేవరెట్!
- భూగోళాన్ని చుట్టేస్తానంటోంది!
- దాంతో మాట్లాడుతుంటే మతి పోయిందనేవాళ్లు!
- ఎరీ... ఆ ఊరి పట్టు..!
- అందరికీ నచ్చేవి.. నాకు నచ్చవు.. ఎందుకిలా?
'స్వీట్' హోం
- రిస్క్ లేకుండా దాచేద్దాం!
- వేసవిలో ఇల్లు చల్లగా...
- పుల్లటి పెరుగుతో.. పెరిగే రుచి!
- కళ్లు తిరిగే కార్పెట్లు...
- ఆ చోటు గుర్తిస్తే చాలు...
వర్క్ & లైఫ్
- పనికి ‘బ్రేక్’ వేయండి!
- మీకు ‘ట్రావెలింగ్’ అంటే ఇష్టమా..?
- ఇవి టైంపాస్ కోసమే కాదు.. సంపాదనకూ..!
- మారాలని గట్టిగా అనుకోండి!
- Samantha: చిన్న చిట్కాలతోనే 45 కిలోల బరువు తగ్గా..!